ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ( Chandrababu Naidu )స్కిల్ స్కామ్ కేసులో భాగంగా అరెస్టు అయ్యి దాదాపు 50 రోజుల పాటు జైలులో గడిపి వచ్చిన విషయం తెలిసిందే.50 రోజులపాటు చంద్రబాబుకు బెయిల్ తీసుకురావడానికి టీడీపీ( TDP ) నేతలు నానా అవస్థలు పడ్డారు.చంద్రబాబు బెయిల్ కోసం చేసిన ప్రయత్నాలు ఫలించకపోవడంతో ఇప్పుడప్పుడే చంద్రబాబు బయటకు రారని రావడం కష్టమని టీడీపీ నేతలు భావించారు.అందరి ఆలోచనలని తలకిందులుగా చేస్తూ కోర్టు అనూహ్యంగా చంద్రబాబుకి షరతులు పెట్టి బెయిల్ మంజూరు చేసింది.
కంటి ఆపరేషన్ చేసుకోవాలని అవకాశం ఇవ్వాలని ఆయన తరపున న్యాయవాదులు కోరడంతో మధ్యంతర బెయిల్ వచ్చింది.అలా చంద్రబాబు బయటకు రావడంతో టీడీపీ నేతలు సంబరాలు అంబరాన్ని అంటాయి.ఆయన బయటికి రాగానే టీడీపీ నేతలు కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు.ప్రస్తుతం వైసీపీ,రెడీపీ నేతల మధ్య చంద్రబాబు బెయిలు విషయంలో మాటల యుద్ధం నడుస్తోంది.చంద్రబాబు బయటకి వచ్చారు దాంతో న్యాయం గెలిచింది, ధర్మం గెలిచిందని టీడీపీ క్యాడర్ సోషల్ మీడియాని హోరెత్తిస్తున్నారు.మరోవైపు వైసీపీ నేతలు కేవలం చంద్రబాబు ఆరోగ్య పరిస్థితిని చూసి మాత్రమే బెయిల్ ఇచ్చారని గుర్తు చేస్తున్నారు.
చంద్రబాబుకి కేవలం బెయిల్ మాత్రమే వచ్చిందని ఆ విషయాన్ని టీడీపీ గుర్తుంచుకోవాలని న్యాయస్థానం ఎక్కడా కూడా నిర్దోషి అని చెప్పలేదని వైసీపీ నేతలు చెబుతున్నారు.జగన్ ఇంగ్లాండ్ లో ఉండి అరెస్ట్ చేస్తే పవన్ ఇటలీలో ఉండే బెయిల్ ఇప్పించాడు అంటూ జనసేన కార్యకర్తలు గట్టిగా కౌంటర్ ఇస్తున్నారు.చాలామంది జనసేన నేతలు చేస్తున్న కామెంట్లను ఏకీభవిస్తూ అవును పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) కారణంగా చంద్రబాబు బయటకు వచ్చారు అంటూ కామెంట్ లతో హోరెత్తిస్తున్నారు.