పెంపుడు జంతువుల మీద ప్రేమ ఉండటం సహజం.వాటికోసం ప్రస్తుతం చాలా మంది ఏదో ఒకటి చేసి తమ ప్రేమని చూపిస్తున్నారు.
అయితే సగం ఆస్తిని పెంపుడు జంతువుల సంరక్షణ కోసం రాసేసేంత ప్రేమ అయితే మాత్రం చాలా తక్కువ మంది అరుదుగా చూపిస్తూ ఉంటారు.ఇప్పుడు ఓ వ్యక్తి అలాగే తన పెంపుడు ఏనుగుల కోసం తన ఆస్తిలో సగం రాసేసి వార్తల్లోకి ఎక్కాడు.
ఈ మేరకు వీలునామాగా రాశాడు.ఈ ఘటన బీహార్ లో చోటుచేసుకుంది.అక్తర్ ఇమామ్ అనే వ్యక్తి ఏసియన్ ఎలిఫెంట్ రిహాబిలిటేషన్ అండ్ వైల్డ్ లైఫ్ యానిమల్ ట్రస్ట్ చీఫ్ మేనేజర్ గా ఉన్నారు.12 ఏళ్ల వయసు ఉన్నప్పటి నుంచి రాణి, మోతీ అనే ఏనుగుల సంరక్షణను చూసుకుంటున్నాడు.అవి రెండు లేకపోతే జీవించలేని పరిస్థితి ఏర్పడిందని చెప్పాడు.వేటగాళ్ల తుపాకీ దాడి నుంచి తనను ఒకసారి ఏనుగులు కాపాడాయని తెలిపారు.ఈ ఏనుగులు తన ప్రాణమని చెప్పాడు.
ఆస్తిలో సగ భాగాన్ని ఏనుగుల పేరిట రాసినందుకు తన భార్య, కొడుకు తనను వదిలి వెళ్లారని, గత పదేళ్ల నుంచి తనకు దూరంగానే ఉంటున్నారని తెలిపాడు.
అంతేకాదు, తప్పుడు కేసు పెట్టి తనను జైలుకు కూడా పంపారని అయితే ఆ కేసులు నిలవకపోవడంతో తాను విడుదలయ్యానని తెలిపాడు.తన కొడుకు స్మగ్లర్లతో కలిసి ఏనుగును అమ్మేందుకు ప్రయత్నించాడని ఆ డీల్ సక్సెస్ కాలేదని చెప్పాడు.
ఏనుగుల కోసం తన ఆస్తిలో సగ భాగాన్ని రాశానని, మిగిలిన సగాన్ని భార్య పేరున రాశానని తెలిపాడు.ఏనుగులు ఉన్నంత వరకు వాటి సంరక్షణ కోసం ఖర్చు చేయడానికి ఈ ఆస్తి ఉంటుందని అవి మరణిస్తే ఆ ఆస్తి ఏఈఆర్ఏడబ్ల్యూఏటీ ట్రస్టుకు వెళ్లేలా వీలునామా రాశానని తెలిపాడు.
మొత్తానికి ఈయన చేసిన పనిని ఇప్పుడు జంతు ప్రేమికులు స్వాగతించడంతో పాటు ఆయనకి అండగా ఉండేందుకు సిద్ధం అయ్యారు.