Paruchuri Gopala Krishna: ఆ ఒక్క కారణం వల్లే సమంత మూవీ డిజాస్టర్.. పరుచూరి సంచలన వ్యాఖ్యలు!

ప్రముఖ సినీ రచయిత పరిచూరి గోపాలకృష్ణ( Paruchuri Gopala Krishna ) గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు.

ఇక అప్పుడప్పుడు ఈయన చేసే వ్యాఖ్యలు బాగా వైరల్ అవుతూ ఉంటాయి.

ముఖ్యంగా సినిమాల పట్ల ఈయన చేసే కామెంట్స్ హాట్ టాపిక్ గా ఉంటాయి.అయితే ఇదంతా పక్కన పెడితే తాజాగా సమంత( Samantha ) సినిమా గురించి కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశాడు పరుచూరి.

ఇంతకు అవేంటంటే.రీసెంట్ గా సమంత.

గుణశేఖర్ దర్శకత్వంలో రూపొందిన శాకుంతలం సినిమాతో( Shaakuntalam Movie ) ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే.ఇక ఇందులో దేవ్ మోహన్ హీరోగా నటించగా.

Advertisement

ఈ సినిమా విడుదలైన తొలిరోజే ఫ్లాప్ అనే టాక్ సొంతం చేసుకుంది.సినిమాకి ముందు జోరుగా ప్రమోషన్స్ చేసినప్పటికీ కూడా ప్రేక్షకులు ఈ సినిమా చూడటానికి ఆసక్తి చూపించలేదు.

దీంతో మొదటి రోజే ఈ సినిమా భారీ డిజాస్టర్ గా నిలిచింది.అయితే తాజాగా ఈ సినిమా గురించి కొన్ని వ్యాఖ్యలు చేశాడు పరుచూరి.

ఇక అవేంటంటే.శకుంతల పాత్రలో సమంత అద్భుతంగా నటించిందని.

ఇక ఈ సినిమాకు గుణశేఖర్ కథను రాసిన విధానం, సినిమాను చూపించిన విధానం బాగున్నప్పటికీ కూడా సెకండ్ హాఫ్ వల్లే సినిమా క్లిక్ కాలేకపోయి ఉండొచ్చని అన్నాడు.దీనివల్లే సినిమా డిజాస్టర్ అయింది అన్నట్లు మాట్లాడాడు.

విజయవాడలో బిజినెస్ అండ్ టూరిజం వీసాపై సదస్సు
హీరో తేజ సజ్జాకు పాదాభివందనం చేసిన పెద్దాయన.. అసలేం జరిగిందంటే?

ఇక ఈ సినిమా తనకు ఒక అద్భుతమైన జ్ఞాపకం అంటూ.గతంలో తను కూడా తెలుగు ఉపన్యాసకుడిగా పని చేసిన రోజుల్లో శాకుంతల నాటకం చూశానని.మళ్లీ ఇంత కాలానికి గుణశేఖర్ ఈ సినిమా రూపొందించాడని అన్నాడు.

Advertisement

ఇక గుణశేఖర్ ను పొగడ్తలతో ముంచాడు.ఈయన సినిమాలు చూస్తుంటే కొత్తదనం అనిపిస్తుంది అని.గతంలో రానాతో చేయాలనుకున్న హిరణ్యకశప్ప కూడా ఆగిపోయిందని అన్నాడు.

మహాభారతం తోని వచ్చిన కొన్ని కథలు సూపర్ హిట్స్ అందుకున్నాయని అన్నాడు.ఇక సినిమాలో కొన్ని సీన్స్ గురించి కూడా పంచుకున్నాడు.శకుంతల గర్భం దాల్చిన తర్వాత భర్త దుష్యంతుడిని కలవడం కోసం రాజ్యానికి వెళ్లడం.

ఆమెను మర్చిపోయిన ఆయన ఇక్కడి నుంచి వెళ్ళిపోని కేకలు వేయటం.గ్రామస్తులు ఆమెను రాళ్లతో కొట్టడం వంటి సన్నివేశాలు సినిమాలో బాగా చూపించారు అని.

అయితే తనకు తెలిసినంతవరకు కాళిదాసు రచించిన కథలో శకుంతలను రాళ్లతో కొట్టినట్లు ఎక్కడ లేదు అని.కానీ ప్రేక్షకులను కనెక్ట్ చేయడం కోసం ఇలా తీసి ఉండొచ్చు అని అన్నాడు.ఇక ఈ కథ ఎన్ని ఏళ్లయినా సజీవం.

శాశ్వతం అంటూ.ఆ కథను ప్రేక్షకులకు అందించాలని ఉద్దేశంతో డైరెక్టర్ సాహసం చేసి ఈ సినిమాను తెరకెక్కించాడని అన్నాడు.

ఇక దుర్వాసుడిగా మోహన్ బాబు అదరగొట్టాడని.సమంత, దేవ్ మోహన్ కూడా అద్భుతంగా నటించారు అని.ఇక మంచి కథలను మర్చి పోతున్న రోజుల్లో సొంత డబ్బును రిస్క్ చేసి ఈ సినిమాను చేసినందుకు గుణశేఖర్ గట్స్ కు హ్యాట్సాఫ్ అంటూ పొగిడాడు.ప్రస్తుతం ఆయన చేసిన వ్యాఖ్యలు బాగా వైరల్ అవుతున్నాయి.

తాజా వార్తలు