సినిమా ఇండస్ట్రీ లో ఒక సినిమా మనకు తెరపైన కనబడాలి అంటే ఎవరు ఎంత కస్టపడి పని చేసిన కూడా ఆ సినిమా అనేది ముందుకు పోవాలి అంటే దానికి ముందుగా ఒక మంచి స్టోరీ ఉండాలి అదే కనక లేకపోతే అసలు సినిమా అనేదే పట్టాలెక్కదు.ఒక మంచి కథ రాయాలంటే ఒక మంచి రచయిత కావాలి అలాంటి వాళ్లలో పరుచూరి బ్రదర్స్ మొదటి స్థానం లో ఉంటారు.ఇప్పటి వరకు 330 పైన సినిమాలకు కథ, మాటలు అందించిన వీళ్లు ఇప్పటికి కూడా సినిమా కి సంబందించిన ఎదో ఒక పని చేసుకుంటూ ఉంటున్నారు పరుచూరి బ్రదర్స్ లో పెద్దాయన అయిన పరుచూరి వెంకటేశ్వర రావు గారు ఆయనకి ఏజ్ ఎక్కువ అవడం తో ఎటు వెళ్లకుండా అయన ఇంటి దగ్గరే ఉంది రెస్ట్ తీసుకుంటుంటే,ఇక పరుచూరి గోపాల కృష్ణ(Paruchuri gopala Krishna ) గారు మాత్రం ఆయనకంటూ ఒక యుట్యూబ్ ఛానెల్ పెట్టుకొని సినిమా కు సంభందించిన చాల విషయాలను చెప్తున్నారు అయన ఎదురుకున్న అనుభవాలను చెప్తూనే సినిమాలమీద ఆయన ఒపీనియన్ చెప్తూ ఉంటారు…అందులో భాగంగానే ఆయన వాళ్ళ అన్నయ్య అయిన వెంకటేశ్వర రావు వల్లే చాలా ఆస్తులని పోగుట్టుకున్నానని చెప్పారు అసలు విషయం లోకి వెళ్తే…

వీళ్లు రైటర్లు గా చాల బిజీ గా ఉన్న రోజుల్లోనే పరుచూరి గోపాల కృష్ణ గారు శోభన్ బాబు తో(Sobhan Babu ) ఒక సినిమా చేసారు.అది సెట్స్ మీద ఉన్నప్పుడే ప్రొడ్యూసర్ అయిన రామానాయుడు, సురేష్ బాబు ఇద్దరు కూడా ఈ సినిమా సూపర్ హిట్ అవుతుందని చెప్పారు…ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకొని రిలీజ్ కూడా అయింది.వాళ్ల్లు చెప్పినట్లుగానే ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి విజయం అందుకుంది ఇక దాంతో గోపాల కృష్ణ గారికి డైరెక్టర్ గా పెద్ద పెద్ద బ్యానర్స్ నుంచి మంచి ఆఫర్స్ వచ్చాయి.

చాల మంది ప్రొడ్యూసర్లు వీళ్ల ఇంటికి వచ్చి ఎదురుగా ఉన్న టేబుల్ మీద అడ్వాన్సులుగా డబ్బులు తెచ్చి పెట్టారు అప్పుడే సురేష్ బాబు పరుచూరి గోపాల కృష్ణ గారితో ఈ డబ్బులు తీసుకొని శంకర్ పల్లి సైడ్ భూములు కొనండి అని చెప్పాడట,కానీ పక్కనే ఉన్న పరుచూరి వెంకటేశ్వర రావు( Paruchuri Venkateswara Rao ) వాడు డైరెక్టర్ అయితే నేను ఏం చెయ్యాలి ఫిడెల్ వాయించుకోవాలా అని అనటం తో గోపాలకృష్ణ ఆ డబ్బులు తీసుకోలేదట.అప్పుడు కనక ఆ డబ్బులు తీసుకొని భూములు కొనుక్కొని ఉంటె ఇప్పుడు నా దగ్గర కనీసం ఒక 100 కోట్ల మేరకు ఆస్తులు ఉండేవని అయన రీసెంట్ గా జరిగిన ఒక ఇంటర్వ్యూ లో చెప్పారు…

అన్నయ్య వద్దు అన్నప్పుడే నేను దాన్ని వదిలేసి వచ్చేసా ఒకవేళ మా అన్నయ్య కనక తీసుకో అని అంటే ఇప్పుడు నేను కోటీశ్వరున్ని అయ్యేవాడిని మా అన్నయ్య వల్లే 100 కోట్లు నష్టపోయాను అని చెప్పుకు వచ్చాడు…ఏది ఏమైనా వీళ్లిద్దరు ఒకరి మాటకు ఒకరు గౌరవం ఇచ్చుకుంటారు కాబట్టే అన్ని సినిమాలకి రైటర్లు గా పనిచేసారు…అన్నదమ్ములు అంటే ఎలా ఉండాలి అనేది వీళ్ళని చూసి నేర్చుకోవచ్చు అంటూ ఇప్పటికే చాలా మంది నెట్లో ఈ న్యూస్ ని వైరల్ చేస్తూ చెప్తున్నారు…
.






