అనకాపల్లిలో జనసేన పార్టీ( Janasena )కి షాక్ తగిలింది.అనకాపల్లి నియోజకవర్గ ఇంఛార్జ్ పరుచూరి భాస్కర్ రావు( Paruchuri Bhaskar Rao ) పార్టీకి రాజీనామా చేశారు.
అనకాపల్లి నియోజకవర్గం( Anakapalli Constituency ) నుంచి టికెట్ ఆశించి ఆయన భంగపడిన సంగతి తెలిసిందే.కాగా నియోజకవర్గ టికెట్ ను జనసేన పార్టీ కొణతాల రామకృష్ణ( Konathala Ramakrishna )కు కేటాయించింది.
దీంతో పరుచూరి మనస్తాపానికి గురయ్యారని తెలుస్తోంది.దాదాపు 24 ఏళ్లల్లో ఒక్క రూపాయి కూడా ఆశించకుండా రాజకీయాలు చేసినట్లు తెలిపారు.
కానీ తనకు సరైన గుర్తింపు మాత్రం రాలేదని వాపోయారు.ఎల్లప్పుడూ అనకాపల్లి ప్రజలకు అండగా నిలుస్తానని తెలిపారు.
అయితే పరుచూరి పార్టీ అధినేత పవన్ కల్యాణ్ అపాయింట్ మెంట్ కోసం ఎదురుచూసినా అవకాశం దక్కలేదని తెలుస్తోంది.