ఒక్క ఉప ఎన్నిక రాష్ట్రాన్ని పాలించేది ఎవరో చెప్పేస్తుందని అన్ని పార్టీలు నమ్ముతున్నాయి.అదేంటి ఒక్క ఉప ఎన్నికతో అదెలా సాధ్యం అనుకుంటున్నారా.
అయితే రాబోయే ఎన్నికల్లో ఏ పార్టీ గెలుస్తుందో చెప్పేందుకు ఈ ఉప ఎన్నిక ఒక రిహార్సల్ లాంటిదని చెబుతున్నారు.ఇక్కడ గెలిస్తే టీఆర్ ఎస్‌కు ఇక తిరుగుండదని, బీజేపీకి తెలంగాణలో స్థానం లేదని భావిస్తున్నారు.
ఒక వేళ బీజేపీ గెలిస్తే రాష్ట్ర వ్యాప్తంగా బలపడేందుకు అవకాశం ఉంటుంది.పైగా టీఆర్ ఎస్‌లో తిరుగుబాటు మొదలవుతుందనే భావన వారిలో ఉంది.
ఇలా ఎటు చూసినా ఈ ఎన్నిక చాలా ప్రాముఖ్యాన్ని సంతరించుకుంది.
అందుకే గత చరిత్రలో ఎన్నడూ లేని స్థాయిలో ఈ ఎన్నికను అన్ని పార్టీలు అత్యంత సీరియస్గా తీసుకున్నాయి.
కేసీఆర్ ఏకంగా దళిత బంధును తీసుకొచ్చారంటేనే అర్థం అవుతోంది ఆ పార్టీకి ఇక్కడ గెలుపు ఎంత ముఖ్యమో.మరి ఇంతటి ప్రాముఖ్యాన్ని సంతరించుకున్న ఉప ఎన్నికల్లో గెలిచేందుకు ఇప్పుడు అన్ని పార్టీలు పంచుడు పోటీలకు రెడీ అయిపోయాయి.ఈ నియోజకవర్గంలో ఓటుకు రూ.6 వేల నుంచి రూ.12 వేల దాకా కవర్లలో పంచిపెడుతున్నట్టు ఇప్పటికే వీడియోలు నెట్టింట విపరీతంగా వైరల్ అవుతున్నాయి .

పైగా కొందరు మహిళలు అయితే తమకెందుకు ఇవ్వట్లేదని రోడ్ల మీద ధర్నాలు చేస్తున్నారు కూడా.కాగా ఒక్క టీఆర్ ఎస్ మాత్రమే కాకుండా ఈటల రాజేందర్ కూడా పంచుతున్నట్టుగా చాలా వీడియోలు బయటకు వచ్చాయి.అయితే కాంగ్రెస్ దీనికి కొంచెం దూరంగా ఉన్నట్టు తెలుస్తోంది.
పైగా కాంగ్రెస్ నేతలు ఈ పంచుడు పోటీలపై ఫిర్యాదు చేయడానికి వెళ్లింది.ఈసీని కలిసి ఉప ఎన్నిక రద్దు చేయించేందుకు ప్రయత్నిస్తోందంటే ఏ స్థాయిలో ఈ పంచడాలు జరుగుతున్నాయో అర్థం చేసుకోవాలి.
ఈ రణరంగంలో ఎవరికి లాభం జరుగుతుందో చూడాలి.
.