కొన్ని కంపెనీల ఉత్పత్తులు ప్రజలకు విపరీతంగా నచ్చుతాయి.ఎన్ని ఏళ్లు గడుస్తున్నా వాటికి ప్రజలలో ఆదరణ కొంచెం కూడా తగ్గదు.
అలాంటి వాటిలో పార్లే-G కూడా ఒకటి.కొందరికి సులభంగా లభించే, సరసమైన ధరకే వచ్చే బిస్కెట్ ప్యాకెట్ ఇది.మరికొందరికి ఇదొక భావోద్వేగం.ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే 25 ఏళ్లుగా ఈ కంపెనీ బిస్కెట్ ధర పెంచకుండా లాభాలు ఆర్జిస్తూ వస్తోంది.
గత 5 ఏళ్లలోనే చాలా వస్తువుల ధరలు 100 శాతం వరకు పెరిగాయి.అలాంటిది పార్లే-జీ(Parle-G) మాత్రం ధర పెంచకుండానే లాభాలు గడిస్తోంది.దీనికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.

1994లో పార్లే-జీ చిన్న ప్యాకెట్ ధర రూ.4 ఉంది.దాని ధర 2021 వరకు పెంచలేదు.2021లో కేవలం రూపాయి అధికంగా పెంచారు.నేటికీ పార్లే-జీ చిన్న ప్యాకెట్ ధర రూ.5గానే ఉంది.అయినప్పటికీ లాభాలు వస్తూనే ఉన్నాయి.దీని వెనుక చిన్న కారణం ఉంది.25 ఏళ్ల పాటు ధర పెంచకపోయినా, బిస్కెట్ ప్యాకెట్ సైజును(Biscuit Packet Size) పార్లే-జి తగ్గిస్తూ వస్తోంది.చేతిలో ఇమిడిపోయేంత సైజులో ప్రస్తుతం ఈ బిస్కెట్ ప్యాకెట్ పరిమాణం ఉంటుంది.

ఇది మొదట 100 గ్రాముల పరిమాణంతో తొలినాళ్లలో ప్రారంభించబడింది.కొన్ని సంవత్సరాల తరువాత బిస్కెట్ ప్యాకెట్ ధరను 92.5 గ్రాములుకు తగ్గించింది.తరువాత దానిని 88 గ్రాములుగా చేశారు.నేటికీ రూ.5 ఖరీదు చేసే చిన్న ప్యాకెట్ 55 గ్రాముల బరువుతో ఉంది.ఏదేమైనా ధర అమాంతంగా పెంచకుండా 25 ఏళ్ల పాటు అదే ధరకు బిస్కెట్ ప్యాకెట్లను(Parle-G Price) విక్రయించడం ఒక రికార్డు అని పలువురు చర్చించుకుంటున్నారు.







