వైసీపీ ఎమ్మెల్యేకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన పరిటాల శ్రీరామ్..!!

అనంతపురం జిల్లా టీడీపీ నేత పరిటాల శ్రీరామ్.రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి కి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు.జిల్లాలో లేకుండా చేస్తావా.దమ్ముంటే ట్రై చెయ్, ఆ తర్వాత పరిణామాలు ఎదుర్కో అంటూ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి కి సవాల్ విసిరారు.అసలు విషయంలోకి వెళితే అనంతపురం ఆశా వర్కర్ పై వైసిపి పార్టీకి చెందిన నేతలు లైంగిక వేధింపులకు గురి చేస్తున్నారని.ఆమె ఇటీవల ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది.

 Paritala Sri Ram Strong Warning To Ycp Mla Topudurthi Prakash Reddy , Paritala S-TeluguStop.com

దీంతో ఈ విషయంపై పరిటాల శ్రీరామ్ ఘాటుగా రియాక్ట్ అయ్యారు.రాప్తాడు నియోజకవర్గంలో మహిళా ఆశా వర్కర్ పై అధికార పార్టీకి చెందిన నేతలు లైంగిక వేధింపులకు పాల్పడడం దారుణం అని అన్నారు.

ఆమె అదృష్టవశాత్తు ఆత్మహత్యాయత్నం నుండి బతికింది అని తెలిపారు.

ఈ క్రమంలో పరిటాల సునీత సదరు బాధితురాలని పరామర్శిస్తే ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి ఇష్టానుసారంగా.

ఆరోపణలు చేయడాన్ని ఖండించారు.బాధితురాలి పై మరో కేసు పెట్టించి.

కేసును పూర్తిగా తప్పుదోవ పట్టించడానికి ప్రయత్నం చేస్తున్నారని పరిటాల శ్రీరామ్ ఆరోపించారు.వివేకానంద రెడ్డి కేసు కే దిక్కులేదు.

ఈ ఆశ వర్కర్ కేసు నీ ఏమి చేయగలరు అని ప్రశ్నించారు.ఈ క్రమంలో తనపై చేసిన విమర్శలకు ఘాటుగా శ్రీరామ్ కౌంటర్లు వేశారు.

మీ అక్రమ సంపాదన అదేవిధంగా అవినీతిపై వివరాలు త్వరలో వెల్లడిస్తామని తెలిపారు.రియల్ ఎస్టేట్ వ్యాపారులతో ఎకరాకు 5 లక్షల అక్రమ వసూలు నువ్వు చేయటం లేదా అంటూ తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి పై పరిటాల శ్రీరామ్ ఆరోపణలు చేశారు.

 

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube