విద్యార్థుల్లో అలాంటి ప్రతిభ చూసి పేరెంట్స్ షాక్.. వీడియో వైరల్..

సాధారణంగా పేరెంట్స్ తమ పిల్లలకు బాగా చదువు రావాలని కోరుకుంటారు.మంచి ర్యాంకు సంపాదించి తమకు గర్వకారణం కావాలని అనుకుంటారు.

బాగా చదువుకుంటే వాళ్లు జీవితంలో పైకి వస్తారని నమ్ముతారు.ఈ క్రమంలో టాప్ స్టూడెంట్స్ ని చూపించే ఇలా చదువుకోవాలి అంటూ చెబుతారు కూడా.

అంతేకాదు, ఇతర పిల్లల కంటే తమ పిల్లలు అన్నింటి ముందుండాలని స్పెషల్ గా కొన్ని కోర్సులు కూడా నేర్పిస్తుంటారు.అయితే కొన్నిసార్లు పిల్లలు ఈ స్పెషల్ టాలెంట్స్( Special talents) ను ప్రదర్శిస్తున్నప్పుడు చూస్తే షాక్ అవ్వక తప్పదు.

ఎందుకంటే టాలెంట్స్ ను పిల్లలు చూపించేటప్పుడు చాలా వింతగా ఇతరులకు భిన్నంగా కనిపిస్తుంటారు.వాళ్లకి ఏమైందో ఏమో అని మిగతా వాళ్ళు భయపడకు తప్పదు.ఇప్పుడు వైరల్ అవుతున్న ఒక వీడియోలో కొంతమంది పిల్లల స్పెషల్ టాలెంట్ చూసి కూడా పేరెంట్స్ షాక్ అవుతున్నారు.

Advertisement

ఆ విద్యార్థుల ప్రతిభ ఎవరినీ మెప్పించడం లేదు సరి కదా చాలామందికి హడల్‌ పుట్టిస్తోంది."మా బిడ్డలకు ఈ గతి పట్టకూడదని కోరుకుంటున్నామ"ని ఈ వీడియో చూసిన తల్లిదండ్రులందరూ వ్యాఖ్యలు చేస్తున్నారు.

ఇంతకీ ఈ వీడియోలో ఏముందంటే, ఒక క్లాస్ రూమ్ లో స్టూడెంట్స్( Students) ఒక మ్యాథ్స్ టెస్ట్ రాస్తున్నారు.అందులో వాళ్లు అబాకస్, స్పీడ్ మ్యాథ్స్ టెక్నిక్స్ ప్రయోగిస్తున్నట్లు మనం చూడవచ్చు.చేతిలో త్వర త్వరగా తిప్పేస్తూ ఏదో మూర్చ వచ్చినట్లు పిల్లలు కాలిక్యులేషన్స్ చేస్తున్నారు.

తీవ్ర ఒత్తిడికి లోనవుతున్నట్లు కూడా మనం చూడవచ్చు.చకచకా లెక్కలు చేస్తున్నారు కానీ వాళ్ళు అలా చేతులు ఊపుతూ ఉంటే కాస్త ఆందోళనకరంగా అనిపించింది.

వారికి ఏదో మానసిక లోపం ఉందేమో అనేలాగా వారి చేతుల కదలికలు ఉన్నాయి.పెద్ద లెక్కలు చేయాలంటే కాలిక్యులేటర్లు ఉపయోగించవచ్చు కదా, ఇప్పటికే పిల్లలు చదువు పేరిట చాలా స్ట్రెస్ ఫేస్ చేస్తున్నారు మళ్ళీ పెద్ద కాలిక్యులేషన్స్ చేయడానికి మెదడుని ఉపయోగిస్తే వారికి ఇబ్బంది అని మరికొందరు పేర్కొన్నారు.

ఎన్ కన్వెన్షన్ కూల్చివేత కరెక్టేనా... రేవంత్ రెడ్డికి మద్దతుగా నిలిచిన నాగబాబు!
అప్పుడేమో అలా.. ఇప్పుడేమో ఇలా.. విష్ణుప్రియ వీడియో వైరల్..

దీనికి బదులు సోషల్ స్కిల్స్, స్పోర్ట్స్ క్రియేటివ్ స్కిల్స్( Social Skills, Sports Creative Skills) నేర్పిస్తే బాగుంటుందని అంటున్నారు.చదివే లోకం లాగా పిల్లలని పెంచితే వారు రియల్ వరల్డ్ లో మంచిగా బతకలేరని పేర్కొంటున్నారు.

Advertisement

తాజా వార్తలు