కాంగ్రెస్ ను ముంచుతున్న టికెట్ల పంచాయతి !

తెలంగాణలో గెలుపే లక్ష్యంగా టి కాంగ్రెస్( Telangana Congress ) అడుగులు వేస్తున్న సంగతి తెలిసిందే.చేరికలు కూడా ఆశించిన స్థాయికంటే ఎక్కువగానే ఉండడంతో ఈసారి గెలుపు పక్కా అని హస్తం నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు.

 Panchayat Tickets Sinking The Congress , Telangana Congress ,revanth Reddy, ,u-TeluguStop.com

అయితే గెలుపు సంగతి అలా ఉంచితే ప్రస్తుతం పార్టీలో టికెట్ల గోల తీవ్ర చర్చనీయాంశం అవుతోంది.ఆశావాహుల నుంచి దరఖాస్తుల స్వీకరణ ముగించి చాలా రోజులౌతున్నప్పటికి.

ఇంతవరకు తొలి జాబితా అభ్యర్థులను ప్రకటించలేదు.స్క్రినింగ్ కమిటీ తరచూ సమావేశం అవుతున్నప్పటికి టికెట్ల కేటాయింపులో తుది నిర్ణయానికి రాలేకపోతున్నారు.

Telugu Congress, Manikrao Thakre, Revanth Reddy-Politics

దీనికి ప్రధాన కారణం స్క్రినింగ్ కమిటీ సభ్యులలో ఏకాభిప్రాయం లేకపోవడమే అనే టాక్ వినిపిస్తోంది.కాంగ్రెస్ స్క్రినింగ్ కమిటీలో రేవంత్ రెడ్డి,( Revanth Reddy ) ఉత్తమ్ కుమార్ రెడ్డి, మాణిక్యం థాక్రే( Manikrao Thakre ) వంటి వారు ఉన్నారు.వీరిలో సీట్ల కేటాయింపు తనదే తుది నిర్ణయం అనే రీతిలో రేవంత్ రెడ్డి వ్యవహరిస్తున్నారనే గుసగుసలు వినిపిస్తున్నాయి.రేవంత్ రెడ్డి తాను సూచించిన వారికే టికెట్ల కేటాయింపు జరపాలని కమిటీలో పట్టుబట్టారట.

తాజాగా కొత్త మనోహర రెడ్డి రేవంత్ రెడ్డిని గూర్చి చేసిన వ్యాఖ్యలు టి కాంగ్రెస్ లో కల్లోలం సృష్టిస్తున్నాయి.

Telugu Congress, Manikrao Thakre, Revanth Reddy-Politics

మహేశ్వరం టికెట్ కేటాయించడానికి పారిజాత నర్శింహారెడ్డి నుంచి టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి( Revanth Reddy ) రూ.10 కోట్లు, 5 ఎకరాల భూమి ఆర్జించారని, ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.దీంతో పార్టీ టికెట్లను రేవంత్ రెడ్డి అమ్మకానికి పెడుతున్నారా అనే సందేహాలు ఆ పార్టీ నేతలే వ్యక్తం చేస్తున్నారు.

దీంతో అర్హత కలిగిన వారికి టికెట్లు కష్టమేనా ? ఎవరు డబ్బు ఎక్కువ ఇస్తే వారికే సీట్ల కేటాయింపు ఉంటుందా ? అనే సందేహాలు పార్టీ నేతల మదిలో మెదులుతున్నాయట.ఇలా అంతర్గత ముడుపుల కారణంగానే కాంగ్రెస్ తొలి జాబితా ఆలస్యం అవుతుందనేది కొందరి వాదన.

ప్రస్తుతం టికెట్ల అమ్మకాలపై వస్తున్న వార్తల నేపథ్యంలో టికెట్లు దక్కని వారి నుంచి పార్టీకి తీవ్ర స్థాయిలో వ్యతిరేకత పెరిగే అవకాశం ఉంది.మరి ఈ టికెట్ల పంచాయతిని హస్తం పార్టీ ఎలా గట్టెక్కిస్తుందో చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube