ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాలలో ఎక్కడ చూసినా కూడా బిగ్బాస్ 7 టైటిల్ విన్నర్ రైతుబిడ్డ పల్లవి ప్రశాంత్( Pallavi Prashanth ) పేరు ఎక్కువగా వినిపిస్తోంది.ఒక కామన్ మ్యాన్ గా హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చిన పల్లవి ప్రశాంత్ బిగ్ బాస్ టైటిల్ విన్నర్ గా నిలవడంతో ప్రతి ఒక్కరు అతన్ని ప్రశంసలతో ముంచెత్తుతున్నారు.
అయితే పల్లవి ప్రశాంత్ గెలిచినందుకు చాలామంది సంతోషపడుతుండగా కొందరు మాత్రం వీడు విన్నర్ ఏంటి అంటూ నిజం పడుతున్నారు.ఇక పల్లవి ప్రశాంత్ విన్నర్ గా నిలిచిన తర్వాత బయటికి వచ్చినప్పుడు జరిగిన గందరగోళం గురించి విధ్వంశాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

ఇక పల్లవి ప్రశాంత్ పై ఉన్న అభిమానంతో చాలామంది పలువురు సెలబ్రిటీల ( Celebrities )కార్లను ధ్వంసం చేయడంతో పాటు వాళ్ళను నానా మాటలు అంటూ రెచ్చిపోయారు.దీంతో నెటిజన్స్ పల్లవి ప్రశాంతపై సోషల్ మీడియాలో ఒక రేంజ్ లో ట్రోలింగ్స్ చేస్తున్నారు.సోషల్ మీడియాలో కొందరూ నెగిటివ్‌గా పోస్ట్‌లు పెడుతున్నారు.కొందరు మీడియా ముందు మాట్లాడుతూ పల్లవి ప్రశాంత్ విన్నర్ కావడంపై అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.ఈ క్రమంలోనే స్వాతి నాయుడు తాజాగా ఒక మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రశాంత్‌పై షాకింగ్ కామెంట్స్ చేసింది.తన పద్ధతి మార్చుకోవాలి.
తనో వేస్ట్ పర్సన్ అర్జున్ విన్నర్ అయుంటే ఇంకా బాగుండేది అంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది.

ఈ సందర్భంగా స్వాతి నాయుడు మాట్లాడుతూ బిగ్ బాస్ హౌస్ షో( Bigg Boss House Show ) స్టార్టింగ్ నుంచి ఇప్పటివరకు చూశాను కానీ ఎప్పటిలాగే బిగ్బాస్ మనం ఒకరు అనుకుంటే బిగ్ బాస్ ఒకరిని సెలెక్ట్ చేయడం అన్నది ఎప్పటినుంచో జరుగుతోంది.ఈ సీజన్లో కూడా అదే జరిగింది.నేను వైల్డ్ కార్డు ద్వారా ఎంట్రీ ఇచ్చిన అర్జున్ విన్ అవుతాడని భావించాను కానీ పల్లవి ప్రశాంత్ విన్నర్ గా నిలిచాడు అంటూ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది స్వాతి నాయుడు.
ఈ సందర్భంగా ఆమె చేసిన వ్యాఖ్యలు అందుకు సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో చాలామంది ప్రశాంత్ అభిమానులు స్వాతి నాయుడు పై ఒక రేంజ్ లో విరుచుకుపడుతున్నారు.







