ఈమద్య కాలంలో కొత్త వారు కొత్త కాన్సెప్ట్‌లతో చేస్తున్న ప్రయత్నాలు మంచి ఫలితాలను ఇస్తున్నాయి.ఈ సినిమాపై కూడా అందరిలో ఆసక్తి ఉంది.
కరుణ కుమార్ దర్శకుడిగా పరిచయం అయిన ఈ చిత్రం విడుదలకు ముందే అందరి దృష్టిని ఆకర్షించింది.ముఖ్యంగా టాలీవుడ్ ప్రముఖులు ఈ సినిమాను ప్రివ్యూ చూసి తప్పకుండా సినిమా బాగుంటుందనే నమ్మకంను వ్యక్తం చేశారు.మరి వారి నమ్మకంను ఈ చిత్రం నిలబెట్టిందా అనేది ఈ రివ్యూలో చూద్దాం.
కథ :
టైటిల్‌ను బట్టే ఈ సినిమా 1978 కాలంలో పలాస ప్రాంతంలో జరిగిన కథ అని అర్థం అవుతుంది.ఆ కాలంలో ఉన్నత వర్గం మరియు బడుగు వర్గాల మద్య వత్యాసం చాలా ఉండేది.ఉన్నత వర్గాల వారు తమ అవసరాల కోసం కింది స్థాయి వారిని ఎలా వాడుకునే వారు, ఆ తర్వాత వారిని ఎలాంటి పరిణామాల మద్య వదిలేసే వారు అనేది ఈ సినిమాలో చూపించారు.
చిన్న షావుకారు(రఘుకుంచె) తన అన్న నుండి ఆధిపత్యంను దక్కించుకునేందుకు బడుగు జాతికి చెందిన ఇద్దరు అన్నదమ్ములను వాడుకుంటాడు.వారిద్దరిని రౌడీలుగా మార్చి తన పబ్బం గడుపుకుంటూ ఉంటాడు.
చివరకు ఏం అయ్యింది? చిన్న షావుకారు కథ ఏంటీ? ఆ అన్నదమ్ముళ్లు ఎవరు అనే విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
నటీనటు నటన :
రక్షిత్ తన పాత్రకు పూర్తి న్యాయం చేశాడు.చాలా అనుభవం ఉన్న నటుడిగా ఈ చిత్రంలో అతడి నటన ఉంది.ముఖ్యంగా కొన్ని ఎమోషనల్ యాక్షన్ సీన్స్‌లో రక్షిత్ చాలా బాగా నటించాడు.
ఇక రఘు కుంచె మొదటి సారి విలన్ పాత్రలో నటించి మెప్పించాడు.హీరోయిన్‌కు ఎక్కువ స్కోప్ దక్కలేదు.
కాని ఆమె కూడా పర్వాలేదు అనిపించింది.మొత్తానికి నటీనటులు అందరి నుండి కూడా దర్శకుడు కరుణ కుమార్ మంచి నటన రాబట్టుకోవడంలో నూటికి నూరు శాతం సక్సెస్ అయ్యాడు.
టెక్నికల్ :
సినిమాలో జానపద పాటలను రఘు కుంచె ట్యూన్ చేశాడు.రెండు మూడు పాటలు ఆకట్టుకున్నాయి.
అయితే రెగ్యులర్ కమర్షియల్ ప్రేక్షకులు మెచ్చే విధంగా అవి లేవని చెప్పక తప్పదు.ఇక బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగుంది.
అన్ని సీన్స్‌లలో కూడా విభిన్నమైన బ్యాక్ గ్రౌండ్ స్కోర్‌తో మెప్పించారు.ఇక 1978 కాలంను కళ్ల ముందు కట్టిన విధంగా సినిమాటోగ్రాఫర్ పని చేశాడు.
ఎక్కడ ఏ లోపం లేకుండా ఇప్పటి ఛాయలు కనిపించకుండా లొకేషన్స్‌ను ఆయన చూపించాడు.దర్శకుడు కరుణ కుమార్ స్క్రీన్‌ప్లే విషయంలో ఇంకాస్త జాగ్రత్తలు తీసుకుని ఉంటే బాగుండేది.
దర్శకత్వంలో మెప్పించాడు.ఎడిటింగ్‌లో కూడా చిన్న చిన్న లోపాలున్నాయి.
నిర్మాణాత్మక విలువలు బాగున్నాయి.
విశ్లేషణ :
కాన్సెప్ట్ బేస్డ్ సినిమాలు వరుసగా వస్తున్న నేపథ్యంలో వచ్చిన ఈ సినిమా కూడా మెప్పించింది.ఒక మంచి కాన్సెప్ట్‌తో నటీనటుల మంచి పర్ఫార్మెన్స్‌తో మెప్పించారు.యదార్థ సంఘటనలకు కల్పిత సన్నివేశాలను జత చేసి ఈ సినిమాను తెరకెక్కించినట్లుగా మొదటి నుండి చెప్పారు.ఆ కారణంగానో ఏమో కాని సన్నివేశాలు చాలా రియలిస్టిక్‌గా ఉన్నాయి.1978 కాలంకు ప్రేక్షకులను తీసుకు వెళ్లిన దర్శకుడు ఎక్కడ కూడా తప్పు జరుగకుండా చూసుకున్నాడు.ప్రతి సీన్‌ను కూడా జాగ్రత్తగా ప్లాన్ చేశాడు.అయితే స్క్రీన్‌ప్లే విషయంలో ఇంకాస్త శ్రధ్ద పెట్టి ఉండాల్సింది.అందరిని కాకున్నా ఎక్కువ శాతం ప్రేక్షకులను మెప్పించే విధంగా ఈ సినిమా ఉంది.
ప్లస్‌పాయింట్స్ :
రియలిస్టిక్ సీన్స్, సంగీతం, ఇంటర్వెల్ ముందు సీన్స్, కొన్ని డైలాగ్స్
మైనస్ పాయింట్స్ :
స్క్రీన్‌ప్లే, కమర్షియల్ ఎలిమెంట్స్ లేవు, క్లైమాక్స్, ఎడిటింగ్
బోటమ్ లైన్ :
వైవిధ్యభరిత చిత్రాలు కోరుకునే వారికోసమే ఈ ‘పలాస 1978’.