పాకిస్థాన్ పరువు తీసిన కమాండో.. విన్యాసాలు చేస్తూ ఆడియన్స్‌పై కుప్పకూలారు...

ఇండియా, పాకిస్థాన్ ( India, Pakistan )దేశాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది.ఇండియా అన్ని దేశాలను మిత్ర దేశాలుగా భావిస్తుంది.

 Pakistan's Defamed Commando Collapsed On The Audience While Doing Acrobatics, Pa-TeluguStop.com

కష్టకాలంలో శత్రువైనా సరే సహాయం చేయడానికి ముందుకొస్తుంది.భారతదేశ మనస్తత్వం అలాంటిది.

కానీ పాకిస్థాన్ అన్యాయంగా కశ్మీర్‌లో( Kashmir ) దాడుల్లోకి పాల్పడుతూ చాలామంది ప్రాణాలను బలి తీసుకుంటుంది.ఆ దేశ ఉగ్రవాదులు ఇండియాపై ఎప్పుడూ కూడా ఉగ్రదాడులకు తెగబడుతుంటారు.

వాటిని ఇండియా సమర్థవంతంగా తిప్పికొట్టి తన సత్తా చాటుకుంటుంది.ఇక క్రికెట్ మ్యాచ్ లో కూడా టీమిండియా పాకిస్థాన్ జట్టును చిత్తుచిత్తుగా ఓడిస్తుంటుంది.

వీటిని పాక్ ప్రజలు ఎప్పటికీ సహించలేరు.

ఇండియా ఏదైనా రంగంలో అద్భుతమైన ఘనత సాధించినప్పుడు కూడా వారు ముఖం మార్చతుంటారు.తాము కూడా అలాంటి ఘనత సాధించగలమని సిల్లీ స్టంట్స్ చేస్తూ వైరల్ అవుతుంటారు.అక్కడి ఆర్మీ అధికారులు( Army officers ) కూడా భారతీయుల కంటే తామే గొప్ప అన్నట్లు బిల్డప్ ఇస్తుంటారు.

అయితే వారు అతిశయోక్తులు పలికినంత గొప్పవారు కాదని, ఒట్టి అసమర్థులు అని చూపించే వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఆ వీడియోలో పాకిస్థాన్ ఆర్మీకి చెందిన ఓ ఎలైట్ ఎస్‌ఎస్‌జీ కమాండో( SSG commando ) ఒక సిల్లీ పొరపాటు చేశాడు.దాంతో పాకిస్థాన్ పరువు అంతా పోయింది.పాకిస్థాన్ ఆక్యుపైడ్ కశ్మీర్‌లోని గిల్గిట్-బాల్టిస్తాన్‌లో ( Gilgit-Baltistan )పారా జంప్ తర్వాత దిగడానికి ప్రయత్నిస్తున్నప్పుడు, కమాండో ప్రేక్షకులపైకి దూసుకెళ్లాడు.

ఆపై వారిపై కుప్పకూలాడు, ఈ ఘటనలో ప్రజలను గాయపరిచాడు.ఈ వీడియో వైరల్ కావడంతో పాక్ సైన్యాన్ని చాలామంది ప్రజలు దారుణంగా ట్రోల్ చేస్తున్నారు.కనీసం పారా జంప్ కూడా సరిగా చేయలేరు మీకెందుకు అంత పొగరు అని వారిని ఏకపారేస్తున్నారు.ఈ వీడియోను @meghupdates అనే ఎక్స్‌ పేజీఎం షేర్ చేసింది దీనికి ఇప్పటికే మూడు లక్షలకు పైగా వ్యూస్ వేలలో లైక్ లు వచ్చాయి.

దీన్ని మీరు కూడా చూసేయండి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube