ఆఫ్గాన్ ప్రభుత్వ ఏర్పాటులో పాక్ నిఘా చీఫ్ .ఆఫ్గానిస్థాన్ లో తాలిబాన్ లకు ప్రభుత్వం ఏర్పాటుకు సహకరించేందుకు పాకిస్తాన్ నిఘా విభాగం( ఐఎస్ఐ) డైరెక్టర్ జనరల్, లెఫ్టినెంట్ జనరల్ అయినా హమీద్ ఆకస్మికంగా కాబూల్ లకు శనివారం చేరుకున్నారని ఇక్కడ మీడియా వర్గాలు తెలిపాయి.
అంతర్జాతీయ సమాజం కూడా ఆమోదించే విధంగా ఆఫ్గాన్ లోతాలిబన్ల ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు తర్జన భర్జన పడుతున్నారని వార్తల నేపథ్యంలో హమీద్ పర్యటన ప్రాముఖ్యత సంతరించుకుంది.హమీద్ నాయకత్వంలో పాకిస్తాన్ సీనియర్ అధికారుల బృందం తాలిబన్ నేతలతో చర్చలు జరుపుతున్నారని పాకిస్తాన్ అబ్జర్వర్ పత్రిక తెలిపింది.
పాకిస్థాన్, ఆఫ్గాన్ ల మధ్య రక్షణ, ఆర్థిక తదితర విషయాల పైన తాలిబాన్లు నాయకత్వంతో హమీద్ చర్యలు జరిపే అవకాశం ఉందని ఆ పత్రిక సమాచారం.

దేశాన్ని విడిచి వెళ్లాలని ఉన్నట్టు విదేశీ జాతీయులను పాకిస్తాన్ మీదుగా పంపగల అవకాశాలను కూడా చర్చించేందుకు కలవనున్నారు.ఆఫ్గాన్ లో ఉన్న తమ పౌరులను తరలించడానికి పాక్ సహాయాన్ని అనేక దేశాలు కోరుతున్నాయి.తాలిబాన్ నాయకత్వంతో సమావేశమైనప్పుడు ఈ అంశాన్ని కూడా హమీద్ చర్చించనున్నారు.
హమీద్ కాబూల్ లో ఒక్కరోజు మాత్రమే ఉంటారని తెలిసింది.సరిహద్దు నిర్వహణ అంశం కూడా చర్చించనున్నారు.
తాలిబాన్లకు పాకిస్థాన్ సైనిక సహాయాన్ని అందిస్తున్న దాన్ని విమర్శలు చాలా కాలంగా ఉన్నాయి.ఆఫ్గాన్ లో ప్రభుత్వాన్ని వచ్చేవారం ఏర్పాటు చేసే అవకాశం ఉందని తాలిబన్ ప్రతినిధి జబీవుల్లా ముజాహిద్ శనివారం తెలిపారు.
ప్రభుత్వ ఏర్పాటు రెండు రోజులుగా వాయిదా పడుతూ ఉన్నది.బ్రిటన్ విదేశాంగ మంత్రి డొమిన్ రాబ్ కాబూల్ కు చేరుకుని సైనికదళాల చీఫ్ ఖమర్ జావేద్ బజ్వాతో సమావేశమయ్యారు.
అంతకు ముందు ఆయన ఇస్లామాబాద్ లో పర్యటించి అఫ్గాన్ పరిస్థితిపై చర్చించారు.