వన్డే వరల్డ్ కప్ టోర్నీలో బంగ్లాదేశ్ పై గెలిచిన పాకిస్తాన్..!!

వన్డే వరల్డ్ కప్( ODI World Cup ) ధోరణిలో పాకిస్తాన్( Pakistan ) ప్రదర్శన ఆ దేశ క్రికెట్ అభిమానులకు ఎంతో నిరుత్సాహం కలిగిస్తోంది.

వరుస పెట్టి నాలుగు ఓటములు చవిచూడటంతో ఒకానొక దశలో పాకిస్తాన్ సెమీస్ కి వెళ్లే అవకాశాలు కూడా తక్కువే అన్నట్టు పరిస్థితులు మారాయి.

ఈ క్రమంలో మంగళవారం కోల్ కతా ఈడెన్ గార్డెన్స్ మైదానంలో బంగ్లాదేశ్ తో( Bangladesh ) జరిగిన మ్యాచ్ లో పాకిస్తాన్ 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.ఈ విజయంతో పాకిస్తాన్ సెమీస్ ఆశలు సజీవంగా నిలిచాయి.మొదట టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న బంగ్లాదేశ్ టీం 45.1 ఓవర్లలో 204 పరుగులకు కుప్పకూలింది.పాకిస్తాన్ పెసర్లు షహీన్ అఫ్రిది, మహ్మద్ వసీం జూనియర్, హరీస్ రవూఫ్ వ్యూహాత్మకంగా బౌలింగ్ చేశారు.

అఫ్రిది 3, వసీం జూనియర్ 3, హరీస్ రవూఫ్ 2 వికెట్లు తీశారు.ఇఫ్తికార్ అహ్మద్ 1, ఉసామా మిర్ 1 వికెట్ పడగొట్టారు.అనంతరం 205 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్తాన్ 3 వికెట్లు కోల్పోయి 32.3 ఓవర్ లలో ఛేదించింది.పాకిస్తాన్ ఓపెనర్స్ ఫకార్ జమాన్,( Fakhar Zaman ) అబ్దుల్లా షఫీక్ లు( Abdullah Shafiq ) 128 పరుగుల భాగస్వామ్యం జోడించి పాక్ విజయానికి బాటలు వేశారు.

ఈ విజయంతో పాక్ సెమీస్ ఆశలు సజీవంగా నిలిచాయి.ఈ టోర్నీలో ఇప్పటి వరకు పాకిస్తాన్ ఏడు మ్యాచ్ లు ఆడగా మూడు విజయాలు సాధించి ఆరు పాయింట్లతో ఐదో స్థానంలో కొనసాగుతోంది.

Advertisement

నెక్స్ట్ న్యూజిలాండ్, ఇంగ్లాండ్ టీములతో ఆడనుంది.ఈ రెండు మ్యాచ్ లలో గెలిస్తేనే పాకిస్తాన్ సెమిస్ కి చేరే అవకాశం ఉంది.

వీడియో: దూడ పుట్టిందని పోలీసులను పిలిచిన రైతు.. ఎందుకో తెలిస్తే...??
Advertisement

తాజా వార్తలు