అందరూ రిజెక్ట్ చేసిన కథతో సినిమా నిర్మించాడు.. కట్ చేస్తే బంపర్ హిట్..!

సినీ ఇండస్ట్రీలో ఎంతో అనుభవం ఉన్నా కొన్నిసార్లు కథలను జడ్జి చేసే విషయంలో ఫెయిల్ అవుతుంటారు దర్శక నిర్మాతలు.ఒక కథ హిట్ అవుతుందా లేదా అని జడ్జి చేయలేక మంచి స్టోరీలను వదులుకుంటారు.

 Padmanabham Super Hit Movie After All Rejections,padmanabham,devata,veeturi Venk-TeluguStop.com

పవన్ కళ్యాణ్, మహేష్, బాబు రవితేజ ప్రభాస్ ఇలా ఈతరం హీరోలు మాత్రమే కాదు అప్పట్లో హీరోలు దర్శక నిర్మాతలు కూడా స్టోరీకి ఉన్న పవర్ అంచనా వేసే విషయంలో విఫలమయ్యారు.ఉదాహరణకు దేవత సినిమా( Devatha ) స్టోరీ అని చెప్పుకోవచ్చు.‘దేవత’ సినిమాకి వీటూరి వెంకట సత్య సూర్య నారాయణ మూర్తి( Veeturi Venkata Satya Suryanarayana Murthy ) కథ అందించారు.ఈ సినిమా తీయడానికి ముందు ఆ కథను చాలామంది దర్శక నిర్మాతలకు చెప్పారు వీటూరి.

కథ బాగుంది కానీ సినిమా తీసేంత ధైర్యం లేదన్నట్లు వారు సైలెంట్ అయిపోయారు.అలా అందరి వద్దకు వెళ్తూ చివరికి ఈ కథ పద్మనాభం( Padmanabham ) వద్దకు వచ్చింది.

పద్మనాభం 1945లో యాక్టర్‌గా సినిమా పరిశ్రమకు పరిచయం అయ్యాడు.కామెడీ, సపోర్టింగ్ రూల్స్ ప్లై చేస్తూ గుర్తింపు తెచ్చుకున్నాడు.

Telugu Devata, Padmanabham, Rekha Murali, Veeturivenkata-Movie

వయసులో ఉన్నప్పుడే “రేఖ అండ్‌ మురళీ ఆర్ట్స్‌”( Rekha and Murali Arts ) అనే సంస్థను ప్రారంభించాడు.ఈ సంస్థలో నాటకాలు వేసేవారు.ఎస్‌.పి.కోదండపాణి నాటకాలకు సంగీతం సమకూర్చేవాడు.కోదండపాణి, పద్మనాభంకు ఆ సమయంలోనే రచయిత వీటూరితో పరిచయం ఏర్పడింది.

వీటూరి ఈ పరిచయం కారణంగా దేవత సినిమా కథను పద్మనాభంకి వినిపించాడు.అయితే పద్మనాభం ఆ కాలంలో బిజియస్ట్ యాక్టర్‌గా రాణిస్తున్నాడు కాబట్టి నిర్మించేందుకు ఆసక్తి చూపలేదు.

ఈ కథను కోదండపాణి( Kodandapani ) కూడా విన్నాడు.అది చాలా మంచి కథ అని తాను ఎప్పుడూ అనుకుంటే వాడు.

అందుకే ఆ కథతో సినిమా తీయాలని పద్మనాభంకు సలహా ఇచ్చాడు.దాంతో పద్మనాభం మరో ఆలోచన లేకుండా ఎన్టీఆర్‌ హీరోగా తీసుకున్నారు.

అనంతరం సావిత్రి, చిత్తూరు నాగయ్య, నిర్మలమ్మ రాజనాల వంటి వారిని కూడా తీసుకున్నారు.ఈ మూవీలో సావిత్రి డబుల్ రోల్ చేసింది.

Telugu Devata, Padmanabham, Rekha Murali, Veeturivenkata-Movie

నిజానికి ఈ మూవీ షూటింగ్ సమయంలో ఆమె 3 నెలల గర్భవతిగా ఉంది.మూవీ షూటింగ్‌కి ఆరు నెలల సమయం పడుతుంది కాబట్టి దీనిని తాను చేయలేనని చెప్పింది.అయితే పద్మనాభం మూడు నెలల్లోనే మీ సన్నివేశాలన్నీ షూట్ చేస్తామని చెప్పి అడ్వాన్స్ కూడా ఇచ్చాడు.ఆ సమయంలో వంద రూపాయల నోటు కింద పడింది.అప్పుడు సావిత్రి మాట్లాడుతూ ఇది శుభసూచికం, ఈ సినిమా ఖచ్చితంగా వంద రోజులు ఆడుతుంది అని చెప్పారు.ఆమె నోటివాక్కు ప్రకారమే ఈ మూవీ 100 రోజులు ఆడి పద్మనాభంకు మంచి లాభం తెచ్చిపెట్టింది.ఈ మూవీని నిర్మించేందుకు పద్మనాభం తన ఇంటిని రూ.40 వేలకు తాకట్టు పెట్టి మరీ డబ్బులు సమకూర్చుకున్నాడు.చివరికి అతనికి మంచి ప్రతిఫలం దక్కింది.1965 జులై 24న ఈ సినిమా రిలీజ్ అయింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube