కీరదోసకాయ చూడగానే చల్లగా ఉంటూ నిగనిగలాడుతూ తినాలనిపించేలా కనిపిస్తాయి.ఇవి శరీరానికి కావాల్సిన పోషకాలను అందంచడంలో ఎంతో ఉపయోగపడతాయి.
మరీ ముఖ్యంగా ఈ కీర దోసకాయ డీహైడ్రేటింగ్ ఏజెంట్ గా కూడా పనిచేస్తుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.అలాగే హై బీపీతో బాధపడేవారికి ఈ కీరదోసకాయ చక్కటి ఔషదంలా పనిచేస్తుంది.
అలాగే పనిమూలంగా కోల్పోయిన నీటిని తిరిగి శరీరానికి అందించడంలో కీర ఎంతో మేలు చేస్తుంది.ఈ కీర దోసలో విటమిన్ ఎ, సీ లు పుష్కలంగా లభిస్తాయి.
కావునా ఇది శరీరానికి ఎంతో మేలు చేస్తుంది.అలాగే ఈ కీర దోస కళ్ల కింద ఏర్పడే నల్లటి వలయాలు లేకుండా చేయడానికి ఇది ఎంతో ఉపయోగపడుతుంది.
అలాగే ఈ కీరలో ఉండే లవణాల మూలంగా గోళ్లు అందంగా ఉంటాయి.వీటితో పాటుగా వెంట్రెకలు పెరగడానికి కూడా ఎంతో మేలు చేస్తుంది.దీనిలో ఉండే సల్పర్, సిలికాన్ వెంట్రుకలు పెరగడానికి దోహాదపడతాయి.అలాగే కడుపులో మంటను, జీర్ణ శక్తిని పెంచడంలో కీర మించిన మంచి ఔషదం మరెక్కడా ఉండదనడంలో ఎలాంటి సందేహం లేదండోయ్.ఎర్రటి ఎండ నుంచి కీరదోష మంచి ఉపశమనం ఇస్తుంది.
అయితే ఈ కీరను తొక్కతోనే తినడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.
అయితే తొక్కలో విటమిన్ ‘కే’ ఉంటుంది.ఇది చర్మానికి ఎంతో మేలు చేస్తుందని నిపుణులు సూచిస్తున్నారు.
అయితే దోసకాయను తొక్కతో తినడం మూలంగా ఎన్నో ప్రయోజనాలున్నాయన్న సంగతి అందరికీ తెలిసిందే.కీరదోసకాయను జ్యూస్ లా చేసుకుని తాగితే ఎసిడీటీ నుంచి ఉపశమనం లభిస్తుంది.
ఇదే కాకుండా కీరదోసకాయతో మరెన్నో ప్రయోజనాలున్నాయి.అయితే తాజాగా కీరదోసకాయ తొక్కలతో ప్యాకేజింగ్ మెటీరియల్ తయారు చేస్తున్నారు.
ఐఐటీ ఖరగ్ పూర్ పరిశోధకులు ఈ తొక్కలతో పర్యావరణ హిత ఫుడ్ ప్యాకెజింగ్ మెటీరియల్ ను తయారు చేసే విధానాన్ని కనుగొనబోతున్నారు.
అయితే కీరదోసకాయ తొక్కలో సెల్యూలోజ్ పరిమాణం, మిగతా పండ్లు, కూరగాయల తొక్కలతో పోలిస్తే 18.22 వాతం ఎక్కువగా ఉందని అసిస్టెంట్ ప్రొఫెసర్ జయితా మిత్రా తెలిపారు.అయితే ఈ తొక్కలో ఉండు సెల్యులోజ్ కు హెమీ సెల్యూలోజ్, పెక్టిన్ వంటి సాకరైడ్ లను కలిపి పర్యావరణానికి ఉపయోగపడే ఫుడ్ ప్యాకేజింగ్ మెటీరియల్ ను తయారు చేయనున్నట్టు ఆయన వివరించారు.
కీర మనిషికే కాకుండా పర్యావరణానికి కూడా ఎంతో మేలు చేస్తుందని ఈ వార్తను చూస్తేనే తెలుస్తోంది.