బొప్పాయి పంట సాగులో ఎరువుల యాజమాన్యం.. సాగుకు అనువైన కాలాలు..!

సాధారణంగా రైతులు ఒకే రకమైన పంటలను కాకుండా పంట మార్పిడి పద్ధతి ద్వారా వివిధ రకాల పంటలను సాగు చేస్తేనే చీడపీడల, తెగుళ్ళ బెడద( Pests ) తక్కువగా ఉంది ఆశించిన స్థాయిలో దిగుబడి పొందడానికి అవకాశం ఉంటుంది.మార్కెట్లో మంచి డిమాండ్ ఉండే పంటలను ఎంపిక చేసుకుని సాగు చేయాలి.

 Ownership Of Fertilizers In Papaya Crop Cultivation Suitable Periods For Cultiva-TeluguStop.com

బొప్పాయి పంటకు మార్కెట్లో ఎప్పుడూ మంచి డిమాండే ఉంటుంది.కొన్ని యాజమాన్య పద్ధతులపై అవగాహన కల్పించుకుని పాటిస్తే చాలు ఊహించని లాభాలు పొందవచ్చు.

ప్రకృతి వ్యవసాయం ద్వారా సాగు చేస్తే పెట్టుబడి కూడా తగ్గుతుంది.బొప్పాయి( papaya ) కాయల నాణ్యత కూడా బాగుంటుంది.

బొప్పాయి పంట సాగుకు మేలు రకం విత్తనాల విషయానికి వస్తే.వాషింగ్ టన్, రెడ్ లేడి, కో-1,2,3 రకాలు వివిధ రకాల తేగుళ్లను తట్టుకొని నిలబడగలవు.

ట్రైకోడెర్మా విరిడి( Trichoderma viridi ) తో విత్తన శుద్ధి చేసుకుంటే నేల నుండి ఎలాంటి తెగుళ్లు పంటను ఆశించలేవు.

Telugu Azo Piperillum, Fertilizers, Papaya-Latest News - Telugu

బొప్పాయి పంట సాగును జూన్, జూలై, అక్టోబర్, నవంబర్ నెలలో ప్రారంభించవచ్చు.రెండు నెలల వయస్సు, 15 సెంటీమీటర్ల పొడవు ఉండే మొక్కలు ప్రధాన పొలంలో నాటుకోవాలి.మొక్కలు నాటుకునే గుంతలలో ప్రతి గుంతకు 20 కిలోల పశువుల ఎరువు, 40 గ్రాముల మూల మైకోరైజా, 20 గ్రాముల ఫాస్ఫో బాక్టీరియా, 20 గ్రాముల అజో పైపిరిల్లం( Azo piperillum ) వేయాలి.

వీటితోపాటు ప్రతి మొక్కకు రెండు కిలోల నాడెప్ కంపోస్టు, ఒక కిలో వేపపిండి, 500 గ్రా.ఘన జీవామృతం అందించాలి.ప్రతి 20 రోజులకు ఒకసారి ద్రవ జీవామృతాన్ని నీటితో పాటు పారించాలి.ప్రతి 15 రోజులకు ఒకసారి పంచగవ్యను మొక్కలపై పిచికారి చేయాలి.

ఈ పద్ధతులను పాటిస్తే రెండు సంవత్సరాల పంట కాలంలో ఒక ఎకరంలో దాదాపుగా 90 టన్నులకు పైగా దిగుబడి పొందవచ్చు.పెట్టుబడి తీసేస్తే కనీసం రూ.2 లక్షల లాభం అర్జించవచ్చు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube