మనలో ప్రతి ఒక్కరూ ఏదో ఒక సందర్భంలో పారసెటమాల్ ట్యాబ్లెట్ ను వినియోగించే ఉంటారు.జ్వరం, ఒళ్లు నొప్పులు సమస్యలతో బాధ పడుతూ ఉంటే డాక్టర్లు పారసెటమాల్ ను ఎక్కువగా సూచిస్తూ ఉంటారు.
అయితే వైద్య నిపుణులు పారసెటమాల్ ట్యాబ్లెట్ ను ఎక్కువగా వినియోగించవద్దని… ఈ ట్యాబ్లెట్ ను ఎక్కువగా తీసుకుంటే ప్రమాదమని హెచ్చరిస్తున్నారు.ప్రతి ఒక్కరూ పారసెటమాల్ ట్యాబ్లెట్ గురించి కనీస అవగాహన పెంచుకోవాలని చెబుతున్నారు.
ఒహియో స్టేట్ యూనివర్శిటీ నిపుణులు పరిశోధనలు చేసి పారసెటమాల్ ట్యాబ్లెట్ గురించి ఈ విషయాలను వెల్లడించారు.కొంతమంది వైద్యులు ఒళ్లునొప్పులతో బాధ పడే వాళ్లకు ప్లేసిబో డ్రగ్ ను సూచిస్తూ ఉంటారని… ఈ డ్రగ్ తో పోలిస్తే పారసెటమాల్ ఎక్కువ ప్రమాదకరమని వైద్యులు, శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
అమెరికాలో తలనొప్పి చికిత్స కోసం ఉపయోగించే acetaminophen అనే పారసెటమాల్ కూడా ప్రమాదకరమని వైద్య నిపుణులు తేల్చారు.
శాస్త్రవేత్తలు తమ పరిశోధనల్లో భాగంగా 189 మందిని ఎంపిక చేసి వారికి వేర్వేరు సమయాల్లో ప్లేసిబో 1000 మిల్లీగ్రాములు, acetaminophen ఇదే మోతాదులో ఇచ్చారు.
అనంతరం మెడిసిన్ తీసుకున్న వారిలో కనిపించే లక్షణాలను బట్టి రేటింగ్ ఇవ్వాలని సూచనలు చేశారు.అధ్యయనంలో పాల్గొన్న బాల్డ్విన్ బే మాట్లాడుతూ ప్లేసిబోతో పోల్చి చూస్తే పారసెటమాల్ తమకు ఎక్కువ ప్రమాదకరంగా తేలిందని చెప్పారు.
అమెరికాలో ప్రధానంగా acetaminophen అనే ఔషధాన్ని వినియోగిస్తారు.వర్చువల్ టెస్టుల ద్వారా వైద్య నిపుణులు ఈ పరిశోధనలు చేసినట్టు తెలుస్తోంది.ప్రస్తుతం కరోనా వైరస్ బారిన పడిన వాళ్లకు వైద్య నిపుణులు acetaminophen ను సూచిస్తున్నారు.అయితే ఎక్కువ మోతాదులో పారసెటమాల్ తీసుకోవడం ప్రమాదకరం అని తేలడంతో డాక్టర్ల సూచనల మేరకు మాత్రమే ఈ ట్యాబ్లెట్ ను వినియోగించాల్సి ఉంది.
అవసరమైతే మాత్రమే ఈ ట్యాబ్లెట్ ను వినియోగించాలని వైద్యులు సూచిస్తున్నారు.