దాస్ కా ధమ్కీ సినిమా( Das Ka Dhamki movie )తో ఈ మధ్య కాలంలో విశ్వక్ సేన్( vishwak sen ) వార్తల్లో నిలిచిన సంగతి తెలిసిందే.ఈ సినిమాకు దర్శకుడు, నిర్మాత విశ్వక్ సేన్ కావడంతో ఈ మూవీపై అంచనాలు పెరిగాయి.
భారీ అంచనాలతో ఈ సినిమా రిలీజ్ కాగా ఈ సినిమాకు టాక్ మాత్రం ఆశించిన విధంగా రాలేదు.విశ్వక్ సేన్ భారీ బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మించడంతో చెప్పుకోదగ్గ స్థాయిలో లాభాలు కూడా రాలేదని సమాచారం అందుతోంది.
ఓవర్ కాన్ఫిడెన్స్( over confidence ) వల్ల ఈ సినిమాకు భారీ స్థాయిలో లాభాలు తగ్గాయని బోగట్టా.ఈ సినిమా అన్ని హక్కులకు సినిమా రిలీజ్ కు ముందు ఒక బయ్యర్ నుంచి 20 కోట్ల రూపాయల రేంజ్ లో ఆఫర్ వచ్చిందట.
అయితే విశ్వక్ సేన్ మాత్రం ఆ ఆఫర్ తక్కువ మొత్తమని భావించినట్టు సమాచారం అందుతోంది.ఒక ఓటీటీ సంస్థ డిజిటల్ హక్కులకు 8 కోట్ల రూపాయల ఆఫర్ ఇచ్చినా ఆ ఆఫర్ కు విశ్వక్ సేన్ నో చెప్పారు.

ప్రస్తుతం డిజిటల్ హక్కుల రేటు తగ్గించినా ఓటీటీ సంస్థలు మాత్రం ఈ సినిమాపై పెద్దగా ఆసక్తి చూపడం లేదని తెలుస్తోంది.అత్యాశకు పోవడం వల్లే విశ్వక్ సేన్ కు ఈ పరిస్థితి వచ్చిందని కామెంట్లు వినిపిస్తున్నాయి.విశ్వక్ సేన్ ప్రస్తుతం ఇతర దర్శకనిర్మాతలతో కలిసి పని చేయడానికి ప్రాధాన్యత ఇస్తున్నారు.సినిమాల ద్వారా సంపాదించిన డబ్బును విశ్వక్ సేన్ ఆచితూచి ఖర్చు చేస్తున్నాడని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

అయితే విశ్వక్ సేన్ లో టాలెంట్ మాత్రం ఎక్కువగానే ఉందని ఆ టాలెంట్ ను సరిగ్గా ఉపయోగించుకుంటే ఎక్కడికో వెళతాడని కామెంట్లు వినిపిస్తున్నాయి.విశ్వక్ సేన్ కెరీర్ ను జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటున్నారు.ప్రస్తుతం ఈ హీరో గామి అనే సినిమాలో నటిస్తుండగా మరో రెండు నెలల్లో ఈ సినిమా థియేటర్లలో రిలీజ్ కానుంది.







