8 లక్షల మంది భారతీయ ఎన్నారైల ఎదురు చూపులు..

అమెరికా వెళ్లి స్థిరపదాలను భావించే ప్రతీ వలస వాసి కలలు గనేది గ్రీన్ కార్డ్ సొంతం చేసుకోవాలని, కేవలం వలస వాసిగా కాదు అమెరికన్ పౌరుడిగా తమకు హోదా కావాలని కోరుకుంటూ ఉంటారు.

అందుకే అంది వచ్చిన ప్రతీ అవకాశాన్ని వినియోగించుకుంటూ ఏళ్ళ తరబడి గ్రీన్ కార్డ్ కోసం కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నారు.

ట్రంప్ హయాంలో గ్రీన్ కార్డ్ ఇచ్చిన దానికంటే కూడా వలస వాసులను అమెరికా నుంచీ ఎలా బయటకి పంపాలేనే దానిపైనే దృష్టి ఎక్కువగా పెట్టారు.వీసాల నిభందనలు కఠినతరం చేస్తూ ట్రంప్ తీసుకున్న నిర్ణయాలు గ్రీన్ కార్డ్ పై ఆశలు పెట్టుకున్న వారి కలలను చిద్రం చేసిందనే చెప్పాలి.

అయితే అధికారంలోకి తాను వస్తే గ్రీన్ కార్డ్ కోసం ఎదురు చూస్తున్న వారికి న్యాయం చేస్తానని బిడెన్ ఎన్నికల ప్రచారంలో హామీ ఇచ్చారు.దాంతో అసలు గ్రీన్ కార్డ్ కోసం ఎంత మంది ఎదురు చూస్తున్నారు అంటూ లెక్కలు వేసిన అమెరికా ఇమ్మిగ్రేషన్ సర్వీస్ తాజాగా గ్రీన్ కార్డ్ కోటాలో ఏ దేశం వారు ఎంత మంది ఉన్నారో ప్రకటించింది.

అమెరికాలో గ్రీన్ కార్డ్ కోసం వేచి చూస్తున్న పలు దేశాల వలస వాసుల సంఖ్య సుమారు 12 లక్షలు ఉన్నారని ఇవన్నీ బ్యాక్ లాగ్ లిస్టు లో ఉన్నాయని తెలిపింది.వీటిలో సుమారు 68 శాతం మంది భారతీయులే ఉన్నారని ప్రకటించింది.

Advertisement

అంటే గ్రీన్ కార్డ్ కోసం ఎన్నో ఏళ్ళుగా నిరీక్షిస్తూ బ్యాక్ లాగ్ లో ఉన్న భారతీయ ఎన్నారైల సంఖ్య దాదాపు 8 లక్షల మందని తెలుస్తోంది.ఇదిలాఉంటే భారత్ తరువాత గ్రీన్ కార్డ్ కోసం ఎదురు చూస్తున్న దేశాలలో చైనా రెండవ స్థానంలో ఉందని తెలిపింది.14 శాతం మంది చైనీయులు గ్రీన్ కార్డ్ కోసం ఎదురు చూస్తున్నారని ప్రకటించింది.అయితే ప్రస్తుతం బ్యాక్ లిస్టు లో ఉన్న భారతీయులు అందరికి గ్రీన్ కార్డ్ రావాలంటే దాదాపు 8 దశాభ్దాల పాటు వేచి ఉండాలి ఈ లోగా దరఖాస్తు చేసుకున్న వారిలో సుమారు 2 లక్షల మంది బ్రతికి ఉండే అవకాశాలు ఉండవని తెలిపింది.

బ్యాక్ లిస్టు దరఖాస్తులు అంటే ప్రతీ ఏటా పరిమితికి మించి వచ్చిన అప్లికేషన్ ను బ్యాక్ లిస్టు లో ఉంచి తరువాత సంవసత్సరం వాటిని పరిగణలోకి తీసుకుంటారు.

Advertisement

తాజా వార్తలు