రాష్ట్ర ప్రభుత్వం 3,4,5 తరగతులు విలీనం చేయాలని G.O 117 విడుదల చేసిన విషయం తెలిసిందే.విద్యార్ధుల తల్లిదండ్రులు తరగతుల విలీనంను తక్షణమే నిలిపివేయాలని రాష్ట్రమంతటా ఆందోళనలు చేస్తున్నా… ముఖ్యమంత్రి మాత్రం స్పందించడం లేదు.అప్పట్లో ప్రభుత్వ పాటశాలలో గణనీయంగా విద్యార్దుల సంఖ్య పెరిగినప్పుడు నాడు-నేడు పనుల వలనేనని గొప్పగా చెప్పుకున్నారు.
నేడు అవే పాటశాలలో విద్యార్దుల సంఖ్య భారీగా తగ్గినప్పుడు ఉపాధ్యాయుల వైఫల్యం అని వారిపైకి నెట్టడం ఎంతవరకు సమంజసం.అసలు విషయం ఏంటంటే… మన ముఖ్యమంత్రి ఒక వ్యాపారస్తుడు.
వ్యాపారస్తుడు ఎప్పుడూ వ్యాపార కోణం లోనే ఆలోచిస్తాడు.
ప్రబుత్వ పాటశాలలో భారిగా విద్యార్ధుల సంఖ్య తగ్గడానికి గల కారణం కేవలం ప్రబుత్వం తీసుకుంటున్న తుగ్లక్ నిర్ణయాలవలనే.
ఎందుకంటే ప్రబుత్వ పాటశాలల్లో విద్యార్దుల సంఖ్య తగ్గితే కొత్తగా టీచర్లను నియమించనవసరం లేదు, వారికి ప్రమోషన్లు ఇవ్వనవ్వసరం లేదు, భవిష్యత్తులో మెఘా డి.ఎ.స్సి తీయనవసరం లేదనే మనం అనుకుంటున్నాము.కానీ జగన్ రెడ్డి ఆలోచన విద్యార్దుల సంఖ్య తగ్గితే మధ్యాహ్న బోజన పధకం పెట్టనవవసరం లేదు, పుస్తకాలు, బట్టలు, బ్యాగులు, బూట్లు, బెల్టులు ఎగ్గోట్టడానికే ఈ ముఖ్యమంత్రి తీసుకున్న తుగ్లక్ నిర్ణయం.
ప్రస్తుతం ప్రబుత్వ పాటశాలలో ఉన్న విద్యార్దులకే ఇప్పటివరకు వారికి ఇవ్వవలసినటువంటి జగనన్న విద్యా కానుక అని గొప్పగా చెప్పుకుంటున్న పుస్తకాలు, బట్టలు, బ్యాగులు, బూట్లు, బెల్టులు ఇప్పటికీ 80 శాతం మందికి పైగా ఇవ్వలేదు.కోవిడ్ విపత్తు నిధులు 1160 కోట్ల రూపాయలను దారి మల్లించడాన్నిసుప్రీంకోర్టు, రాష్ట్ర ప్రభుత్వంను మందలించింది వెంటనే ఆ నిధులను రాష్ట్ర విపత్తులసాయం ఖాతాలోకి జమ చేయాలని ఆదేశించింది.
కరోనా పరిహారం అందలేని వారు ఎవరైనా పిర్యాదు చేస్తే, నాలుగు వారాల్లోగా పరిష్కరించాలని సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చింది.కాబట్టి రాష్ట్ర ప్రబుత్వం ఇప్పటికైనా సాకులు చెప్పకుండా కోవిడ్ బాధితులను ఆదుకోవాలని కోరుకుంటున్నాను.







