ఆనంద్ దేవరకొండ, విరాజ్ అశ్విన్ హీరోలుగా వైష్ణవి చైతన్య( Vaishnavi Chaitanya ) హీరోయిన్ గా నటించిన లేటెస్ట్ మూవీ ”బేబీ”.పెద్దగా అంచనాలు లేకుండా రిలీజ్ అయ్యి ఇప్పుడు బ్లాక్ బస్టర్ గా నిలిచింది.ఈ మూవీ యూత్ కు బాగా కనెక్ట్ అయ్యింది.ఎందుకంటే ఇది లవ్ స్టోరీ కావడం అది మనసుకు హత్తుకునేలా ఉండడంతో ఈ సినిమా ఓ రేంజ్ లో హిట్ అయ్యింది.
ప్రముఖ రచయిత, దర్శకుడు సాయి రాజేష్( Sai Rajesh ) తెరకెక్కించిన ఈ సినిమా గత నెల రిలీజ్ అయ్యింది. జులై 14న</emగ్రాండ్ గా రిలీజ్ అయిన ఈ సినిమా యూత్ ఫుల్ లవ్ స్టోరీగా నిలిచింది.
అంతేకాదు నిర్మాతల జేబులను దండిగా నింపింది.మరి థియేటర్స్ లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ కాగా ఇప్పుడు ఓటిటి ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధం అవుతుంది.
ఈ సినిమా ఓటిటి రిలీజ్ పై గత కొన్నాళ్లుగా ఏదొక వార్త వైరల్ అవుతూనే ఉంది.ఈ సినిమా థియేటర్ రన్ క్లోజ్ అవ్వడంతో దాదాపు నెలన్నర తర్వాత ఓటిటిలో రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేసారు.ఈ మేరకు ఈ రోజు అఫిషియల్ అప్డేట్ సైతం ఇచ్చారు.ఈ సినిమాను థియేటర్స్ కే మొదట ప్రాధాన్యత ఇచ్చి క్లోజింగ్ వరకు ఉన్న తర్వాతనే స్ట్రీమింగ్ కు తీసుకు వస్తున్నారు.
దాదాపు నెలన్నర తర్వాత బేబీ సినిమా( Baby Movie ) ఓటిటి రైట్స్ ను ఆహా వారు సొంతం చేసుకున్నారు.తాజాగా మేకర్స్ అఫిషియల్ గా అందించిన అప్డేట్ ప్రకారం ఈ సినిమా ఆగస్టు 25 నుండి స్త్రీమింగ్స్ కాబోతుంది అని కన్ఫర్మ్ చేసారు.మరి ఆ రోజు కోసం బేబీ లవర్స్ ఎదురు చూడాల్సిందే.కాగా ఈ సినిమాను మాస్ మూవీ మేకర్స్ వారు నిర్మించగా.విజయ్ బుల్గానిస్ సంగీతం అందించారు.