ప్రతి వారం లాగే ఈ వారం కూడా థియేటర్లో ఓటీటీలో విడుదల కావడానికి కొన్ని సినిమాలు, వెబ్ సిరీస్( Web series ) లు సిద్ధంగా ఉన్నాయి.అలాగే ఇప్పటికే థియేటర్లలో విడుదల అయ్యి మంచి సక్సెస్ ని సాధించిన సినిమాలు ఓటీటీ లోకి విడుదల కావడానికి సిద్ధంగా ఉన్నాయి.
మరి ఈ వారం విడుదల కాబోతున్న సినిమాల జాబితా విషయానికి వస్తే.అక్షయ్ కుమార్,పరిణితి చోప్రా కలిసిన నటించిన మిషన్ రాణిగంజ్ సినిమా( Mission Raniganj movie ) నేడు అనగా డిసెంబర్ ఒకటి నుంచి నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది.
అలాగే నిమేషా సజయన్, సిద్ధార్థ్ ( Nimesha Sajayan, Siddharth )కలిసి నటించిన చిన్నా మూవీ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో నేటి నుంచి స్ట్రీమింగ్ కానుంది.

హారిసన్ ఫోర్డ్, వాలర్ బ్రిడ్జ్ ప్రధాన పాత్రలో నటించిన ఇండియానా జోన్స్: ది డయల్ ఆఫ్ డెస్టినీ సినిమా డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో డిసెంబర్ 1 నుంచి స్ట్రీమింగ్ అవుతోంది.టాలీవుడ్ హీరో నాగచైతన్య అలాగే, పార్వతీ తిరువత్తు కలిసి నటించిన దూత( dootha ) అనే వెబ్ సిరీస్ డిసెంబర్ ఒకటి నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానుంది.మధుర్ మిత్తల్, మహిమా నంబియార్ కలిసిన నటించిన 800 మూవీ( 800 movie ) జియో సినిమాలో డిసెంబర్ 1 నుంచి స్ట్రీమింగ్ కానుంది.
అదేవిధంగా విక్కీ కౌశల్ సారా అలీ ఖాన్ కలిసి నటించిన జర్ హట్ కే జర్ వి బచ్ కే మూవీ జియో సినిమాలో డిసెంబర్ ఒకటి నుంచి స్ట్రీమింగ్ కానుంది.

సంపూర్ణేష్ బాబు శరణ్య ప్రదీప్ కలిసి నటించిన మార్టిన్ లూథర్ కింగ్ సినిమా సోనీ లివ్ లో స్ట్రీమింగ్ అవుతోంది.అలాగే ప్రియాన్షు, శృతి మేనన్ కలిసి నటించిన షేకర్ లక్ హట్ మూవీ అమెజాన్ లో ప్రైమ్ వీడియోలో నవంబర్ 30 నుంచి స్ట్రీమింగ్ అవుతోంది.కిరణ్ అబ్బవరం,నేహా శెట్టి కలిసిన రూల్స్ రంజన్ సినిమా నవంబర్ 30 నుంచి ఆహాలో స్ట్రీమింగ్ అవుతోంది.







