గత 24 గంటలుగా నాటునాటు సాంగ్ (Natunatu Song)కు వచ్చిన ఆస్కార్ అవార్డ్(Oscar Award) గురించి సోషల్ మీడియా వేదికగా చర్చ జరుగుతోంది.ఈ ఆస్కార్ అవార్డ్ కీరవాణి, చంద్రబోస్ లకు వచ్చినా ఎన్టీఆర్, చరణ్, రాజమౌళి(NTR, Charan, Rajamouli) పేర్లు మారుమ్రోగాయి.
దేశ విదేశాల్లో నాటు నాటు సాంగ్ గురించి చర్చ జరగడంతో పాటు ఇప్పటివరకు ఈ సాంగ్ ను చూడని వాళ్లు సైతం యూట్యూబ్ ద్వారా ఈ సాంగ్ ను చూడటానికి తెగ ఆసక్తి చూపిస్తున్నారు.
అయితే ఆస్కార్ అవార్డ్ తో ఎన్టీఆర్, చరణ్ మార్కెట్ ఏకంగా 2000 కోట్ల రూపాయలకు పెరిగిందని కామెంట్లు వినిపిస్తున్నాయి.
తర్వాత ప్రాజెక్ట్ లను సరిగ్గా ప్లాన్ చేసుకుంటే విదేశాల్లో కూడా ఈ హీరోల సినిమాలు చరిత్ర సృష్టించడం ఖాయమని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.ఎన్టీఆర్, చరణ్ విదేశాల్లో కూడా తమ సినిమాలు రిలీజ్ అయ్యేలా ప్లాన్ చేసుకుంటే మంచిదని అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.

ఎన్టీఆర్30(NTR30) రెగ్యులర్ షూట్ మార్చి నెలాఖరున మొదలై నవంబర్ నెలాఖరు వరకు జరగనుంది.చరణ్ శంకర్ సినిమాతో, ఎన్టీఆర్ కొరటాల శివ సినిమాతో పాన్ వరల్డ్ స్థాయిలో సత్తా చాటుతారని ఫ్యాన్స్ భావిస్తున్నారు.చరణ్ శంకర్(Shankar) కాంబో మూవీ పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతుండగా ఎన్టీఆర్ కొరటాల కాంబో మూవీ పోర్ట్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతోంది.నాటు నాటు సాంగ్ కు ఆస్కార్ తో తెలుగు ప్రేక్షకుల సంతోషానికి అవధులు లేకుండా పోయాయి .

రాజమౌళి ఆస్కార్ రావడంతో తన భవిష్యత్తు ప్రాజెక్ట్ లను మరింత స్పెషల్ గా ప్లాన్ చేసుకుంటున్నారని సమాచారం.మహేష్(Mahesh) సినిమాను మరింత స్పెషల్ గా రాజమౌళి ప్లాన్ చేస్తున్నారని తెలుస్తోంది.హాలీవుడ్ స్థాయి టెక్నీషియన్లతో హాలీవుడ్ లెవెల్ లో ఈ సినిమా తెరకెక్కనుందని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది.







