టాలీవుడ్ దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి(rajamouli) ఆర్ఆర్ఆర్ గురించి మనందరికీ తెలిసిందే.గత ఏడాది విడుదలైన ఈ సినిమా ఎంతటి విజయాన్ని అందుకుందో మనందరికీ తెలిసిందే.
ఇది ఇలా ఉంటే ఈ సినిమాలోని నాటు నాటు పాటకు ఆస్కార్ అవార్డు (Natu Natu song)వచ్చిన విషయం తెలిసిందే.ఇక ఈ ఆస్కార్ అవార్డుల కార్యక్రమం తర్వాత రాజమౌళికి ప్రపంచవ్యాప్తంగా భారీగా ఫ్యాన్స్ ఫాలోయింగ్ పెరిగిపోయింది.
ప్రస్తుతం ఎక్కడ చూసినా కూడా రాజమౌళి గురించే చర్చించుకుంటున్నారు.

తెలుగు సినిమా ఇండస్ట్రీ ఇండియా స్థాయిలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా చాలా మంది రాజమౌళిని ఫాలో అవుతున్నారు.ఇంతవరకు బాగానే ఉన్నప్పటికీ ఈ క్రేజ్ రాజమౌళిని ఇబ్బందులు పడేస్తుందా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.అదేంటి అనుకుంటున్నారా.
అయితే ఇది చదవాల్సిందే.రాజమౌళి ఇప్పటివరకు తెరకెక్కించిన 12 సినిమాలు కూడా బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడం మాత్రమే ఆ సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద సరికొత్త ట్రెండ్ ను సెట్ చేసే విధంగా చేశారు రాజమౌళి.
సినిమా సినిమాకి తన క్రేజ్ ని పెంచుకోవడంతో పాటు ఎక్స్పెక్టేషన్స్ ని కూడా అంతకంతకు పెంచుకుంటూ పోతున్నాడు.

రాజమౌళితో సినిమా అంటే హిట్ కొట్టడం గ్యారంటీ అన్న రేంజ్ కి ఎదిగిపోయాడు రాజమౌళి.అయితే ఆర్ఆర్ఆర్ సినిమా ఆస్కార్ వరకు వెళ్లడంతో తన తదుపరి సినిమాపై అంచనాలతో పాటు ఒత్తిడి కూడా విపరీతంగా పెరిగిపోతోంది.రాజమౌళి తన తర్వాత సినిమాను మహేష్ బాబు (mahesh babu)తో రూపొందించనున్న విషయం తెలిసిందే.
మరి ఆస్కార్ విజయం మహేష్ బాబు, రాజమౌళి కాంబినేషన్ పై ప్రెజర్ తీసుకు రానుందా అంటే అవుననే వార్తలు వినిపిస్తున్నాయి.ఆర్ఆర్ఆర్ ప్రభంజనాన్ని సృష్టించడంతో రాజమౌళి తదుపరి సినిమా పై అంచనాలు ఒక రేంజ్ లో ఉన్నాయి.
ఆస్కార్ అనేది రాజమౌళి,మహేష్ సినిమా ప్లస్ లేదా మైనస్ అవుతుందా అనేది తెలియాల్సి ఉంది.







