తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం దాదాపు కన్ఫర్మ్ అని ఆ పార్టీ నేతలు ఫుల్ కాన్ఫిడెంట్ గా ఉన్నారు.మెజారిటీ ఎగ్జిట్ పోల్స్ కూడా కాంగ్రెస్ పార్టీకీ( Congress party ) పట్టం కట్టడంతో ఇక ఫలితాలే తరువాయి అన్న రీతిలో హస్తం పార్టీ నేతలు ఉన్నారు.
ప్రస్తుతం అన్నీ సర్వేలు చెబుతున్నట్లుగా కాంగ్రెస్ విజయం సాధిస్తే ఆ పార్టీలో ఎవరు సిఎం అనేదే ఇప్పుడు ప్రధానంగా జరుగుతున్నా చర్చ.కాంగ్రెస్ పార్టీలో మొదటి నుంచి కూడా సిఎం అభ్యర్థి పదవిపై కన్యూజన్ సాగుతూనే ఉంది.
చాలమంది నేతలు సిఎం పదవి కోసం పోటీ పడుతున్నారు.

ముఖ్యంగా టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి,( Revanth Reddy ) కోమటిరెడ్డి వెంకటరెడ్డి, భట్టి విక్రమార్క( Bhatti Vikramarka ), మధుయాష్కీ గౌడ్, సీతక్క.ఇలా సిఎం రేస్ ఉన్న వారి సంఖ్య ఎక్కువగానే ఉంది.వీటితో పాటు మరికొంత మంది కొత్త నేతలను కూడా సిఎం రేస్ లో ఉన్నట్లు టాక్ వినిపిస్తోంది.
దాంతో వీరందరిలో నుంచి సిఎం అభ్యర్థిని ఎంపిక చేయడం కాంగ్రెస్ పార్టీకి కత్తి మీద సామే.ఎందుకంటే వీరిలో ఏ ఒక్కరినీ సిఎం అభ్యర్థిగా ప్రకటించిన మిగిలిన వారి నుంచి తీవ్రమైన వ్యతిరేకత ఏర్పడే అవకాశం ఉంది.
ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్న టాక్ ప్రకారం రేవంత్ రెడ్డిని సిఎం అభ్యర్థిగా ప్రకటించేందుకు అధిష్టానం అడుగులు వేస్తున్నట్లు సమాచారం.

అయితే రేవంత్ రెడ్డిని భట్టి విక్రమార్క, కోమటిరెడ్డి వెంకటరెడ్డి( Komatireddy Venkat Reddy ) వంటివారు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.దాంతో వీరి వల్ల పార్టీలో చీలిక ఏర్పడిన ఆశ్చర్యం లేదనేది కొందరు చెబుతున్నా మాట.ఆ మద్య జరిగిన కర్నాటకలో కూడా కాంగ్రెస్ పార్టీలో సిఎం పదవి విషయంలోనే గందరగోళం నెలకొన్న సంగతి తెలిసిందే.సుధీర్ఘ మంతనాలు చర్చల తరువాత సిద్దిరామయ్యను సిఎం అభ్యర్థిగా ఎంపిక చేసింది అధిష్టానం.ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ లో కూడా అదే కన్ఫ్యూజన్ నెలకొనే పరిస్థితులు కనిపిస్తున్నాయి.
మరి ఫలితాల తరువాత ప్రస్తుతం సిఎం రేస్ లో ఉన్న ఎవరో ఒకరిని సిఎంగా ప్రకటిస్తారా లేదా ఎవరు ఊహించని అభ్యర్థిని సిఎంగా ఎన్నుకుంటారా అనేది చూడాలి.