ఏపీకి మిచాంగ్ తుఫాన్ ముప్పు పొంచి ఉంది.ఈ క్రమంలో కోస్తాంధ్ర వైపు తుఫాన్ దూసుకువస్తుంది.
ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తీవ్ర వాయుగుండంగా మారింది.గడిచిన ఆరు గంటల్లో గంటకు 18 కిలోమీటర్ల వేగంతో పశ్చిమ వాయువ్య దిశగా పయనిస్తోంది.
తీవ్ర వాయుగుండం రాగల 24 గంటల్లో తుఫాన్ గా మారే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది.ఈ క్రమంలోనే ఈనెల 4 నాటికి వాయువ్య దిశగా దక్షిణాంధ్ర, ఉత్తర తమిళనాడు తీరానికి చేరువ అయ్యే అవకాశం ఉంది.
తరువాత ఈనెల 5న నెల్లూరు, మచిలీపట్నం మధ్య తీరం దాటే అవకాశం ఉందని తెలుస్తోంది.ఈ నేపథ్యంలో కోస్తాంధ్రలోని అన్ని ఓడరేవులకు ఒకటో నెంబర్ ప్రమాద హెచ్చరిక జారీ చేసింది.
అలాగే మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని హెచ్చరికలు జారీ చేసింది.







