ప్రతిపక్షాలు వాయిదా తీర్మానం ఇచ్చాయి..బొత్స సత్యనారాయణ, మున్సిపల్ శాఖ మంత్రి

ప్రతిపక్షాలు వాయిదా తీర్మానం ఇచ్చాయి.స్పీకర్ తిరస్కరించారు.

అయినా ప్రభుత్వం చర్చకు సిద్ధమంది .

అయినా స్పీకర్ పోడియం వద్దకు వచ్చి కాగితాలు చించి స్పీకర్ పై వేశారు ప్రశ్నోత్తరాల్లో టీడీపీ వాళ్లే నాలుగు అంశాలు ఇచ్చారు ఓటీఎస్ మీద ప్రశ్న ఇచ్చారు.మేము సమాధానం చెప్తే వాస్తవాలు ప్రజలకు తెలిస్తే వాళ్ళకి నూకలు చెల్లుతాయని ఈ రగడ ఔట్ సోర్సింగ్ ప్రశ్న విషయంలో వారి జీతాలు పెంచారు దానిపై ప్రభుత్వం కమిటీ వేసి పరిష్కారం దిశగా ప్రయత్నం చేస్తోంది.

దానికి సమాధానం చెప్దామన్నా నిజాలు బయటకు రాకుండా ఈ రగడ ధాన్యం సేకరణపై వివరణ ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉంటే ప్రజలకు వాస్తవాలు తెలుస్తాయని అల్లరి చేస్తున్నారు రైతు భరోసా విషయంలోనూ ప్రశ్న వేశారు.వారి అబూత కల్పనలకు సమాధానం చెప్దామంటే గోల చేస్తున్నారు.

ఈ అంశాలపై చంద్రబాబు, ఆయన కోటరీ చేస్తున్న ప్రచారం అవాస్తవం అని సభను అడ్డుకోవడం ద్వారా తేలిపోయింది సభలో వీరి ప్రవర్తనను మేము ఖండిస్తున్నాం మీరు ఇంతవరకూ చెప్తున్నవి అబద్ధాలే కదా.? మృతుల విషయంపై మా డిప్యూటీ సీఎం వెళ్లి చూసి వచ్చారు.నకిలీ మద్యం అయితే మూకుమ్మడిగా చనిపోతారు.

Advertisement

ఇక్కడ అది లేదు ఒక నెల రెండు నెలల్లో జరిగాయి.ఎక్కువ మద్యం సేవించడం వల్ల చనిపోయారు అని కుటుంబ సభ్యులు చెప్తున్నారు కొంత మంది వయసు పైబడిన వారు ఉన్నారు అయినా ప్రభుత్వం తన పని తాను చేస్తుంది.

కుటుంబ సభ్యులు పిర్యాదు కూడా చేయలేదు కదా వెంటనే కుటుంబ సభ్యులు ఖననం చేశారు.మళ్లీ తీసి పోస్ట్ మార్టం చేశారు సభలో వాస్తవాలను స్పష్టంగా ప్రకటన చేస్తాం.

Advertisement
" autoplay>

తాజా వార్తలు