విపక్షాల ఆందోళనలతో లోక్సభ గందరగోళంగా మారింది.మణిపూర్ లో ఇటీవల చోటు చేసుకున్న అమానుష ఘటనపై ప్రతిపక్షాలు చర్చకు పట్టుబట్టాయి.
ఈ క్రమంలోనే స్పీకర్ పోడియాన్ని చుట్టుముట్టిన విపక్ష సభ్యులు చర్చ జరపాలని డిమాండ్ చేశారు.దీంతో మణిపూర్ ఘటనపై చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధమని స్పీకర్ ఓం ప్రకాశ్ బిర్లా తెలిపారు.
కాగా ప్రతిపక్షాల ఆందోళనల మధ్య లోక్ సభలో ప్రశ్నోత్తరాలు కొనసాగుతున్నాయి.