హీరో సందీప్ కిషన్ వర్షా బొల్లమ్మ కావ్య థాపర్ హీరో హీరోయిన్లుగా ఆనంద్ దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు వచ్చినటువంటి చిత్రం ఊరి పేరు భైరవకోన( Ooru Peru Bhairavakona )అనిల్ సుంకర రాజేష్ దండ నిర్మాణంలో ఈ సినిమా నేడు ఫిబ్రవరి 16వ తేదీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది.మరి ఈరోజు విడుదలైనటువంటి ఈ సినిమా ఏ విధమైనటువంటి ఆదరణ సొంతం చేసుకుని ఈ సినిమా కథ ఏంటి అనే విషయానికి వస్తే.
కథ:
బసవ( సందీప్ కిషన్) అతని ఫ్రెండ్ జాన్ ( వైవా హర్ష) ఒక దొంగతనం చేసి.అనుకోకుండా భైరవకోన అనే ఊరిలోకి ఎంటర్ అవుతారు.
వీరితో పాటు గీత ( కావ్య థాపర్)( Kavya Thapar) కూడా ఆ ఊరిలోకి ఎంటర్ అవుతుంది.ఇలా ఈ ముగ్గురు భైరవకోనలోకి ఎంటర్ అయిన తర్వాత వారికి విచిత్రమైనటువంటి పరిస్థితులు ఎదురవుతూ ఉంటాయి.
అన్ని ఊర్ల మాదిరి కాకుండా భైరవకోన కాస్త ప్రత్యేకంగా ఉంటుంది.ఈ సమయంలోనే బసవ దొంగలించిన బంగారాన్ని.
రాజప్ప దక్కించుకుంటాడు.అవి తిరిగి దక్కించుకోవాలంటే కుదరదు.
అసలు భైరవకోన ఎందుకు ఇంత ప్రత్యేకంగా ఉంది గరుడ పురాణంలో మిస్ అయినటువంటి నాలుగు పేజీలలో ఏముంది? ప్రేమించిన అమ్మాయి కోసం బసవ ఎందుకు దొంగతనం చేశారు అనే విషయాలు ఆసక్తి కలిగిస్తాయి.
నటీనటుల నటన:
సందీప్ కిషన్ నటన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు ఈయన ఏదైనా ఒక పాత్రకు కమిట్ అయ్యారు.సందీప్ ఏదైనా పాత్రకు కమిట్ అయితే 100% ఆ పాత్రకు న్యాయం చేస్తారు.కానీ ఈ సినిమాలో ఆయన లుక్ పరంగా పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయారు.
ఇక వర్ష బొల్లమ్మ నటన అద్భుతంగా ఉంది.కావ్య థాపర్ వెన్నెల కిషోర్ వైవా హర్ష వంటి వారందరూ కూడా వారి పాత్రలకు పూర్తిగా న్యాయం చేశారు.
టెక్నికల్:
శేఖర్ చంద్ర మ్యూజిక్ బాగుంది.నిజమేనా చెబుతున్న పాట పెద్ద ఎసెట్.ఇక బిజీఎం కూడా ఆకట్టుకుంటుంది.సినిమా అంతా ఒకే కథ కావడంతో ఎడిటింగ్ ఒక అవకాశం లేకుండా పోయింది.కెమెరా వర్క్ ఓకే అనిపించింది.ప్రొడక్షన్ వ్యాల్యూస్ మాత్రం బాగున్నాయి.
విశ్లేషణ:
ఇప్పటికీ ఎన్నో సోసియే ఫాంటసీ సినిమా కథలు మన ముందుకు వచ్చాయి.ఇక ఈ సినిమాలో కూడా మొదటి హాఫ్ మొత్తం కొన్ని ట్విస్ట్ చూపించారు సెకండ్ హాఫ్ ముందు ఈ ట్విస్ట్ రివిల్ కావటంతో సినిమా ప్రేక్షకులకు పెద్దగా కనెక్ట్ కాలేకపోయింది.సెకండ్ హాఫ్ అద్భుతంగా ట్విస్టులతో ఉన్నప్పటికీ ఒక్కో ట్విస్ట్ రివ్యూ అవడంతో ప్రేక్షకులు ఇంట్రెస్ట్ చూపించలేకపోయారు.వీటికి తోడు వైవా హర్షా, వెన్నల కిషోర్ కామెడీ కూడా బాగా వర్కౌట్ అవ్వడం కలిసి వచ్చింది.
ప్లస్ పాయింట్స్:
ఫస్ట్ హాఫ్, వెన్నెల కిషోర్ వైవా హర్ష నటన, మ్యూజిక్.
మైనస్ పాయింట్స్:
సెకండ్ హాఫ్, ఎమోషన్స్ మిస్ అవ్వటం, బోర్ కొట్టే సన్నివేశాలు.
బాటమ్ లైన్:
ఇలాంటి సోసియో ఫాంటసీ సినిమాలు ఎన్నో ప్రేక్షకుల ముందుకు వచ్చాయి కానీ ఈ సినిమాలో అదే ఫాంటసీ కాస్త ఎక్కువైందని చెప్పాలి.