దెయ్యాలు నిర్మించిన ఈ ఆలయం గురించి మీకు తెలుసా.. ఈ ఆలయం ఎక్కడ ఉందంటే?

సాధారణంగా ఎవరైనా దెయ్యాలు నిర్మించిన ఆలయం అనే టాపిక్ తెస్తే దెయ్యాలు ఎక్కడైనా ఆలయాన్ని నిర్మిస్తాయా అనే ప్రశ్న వ్యక్తమవుతుంది.

అయితే ఒక శివాలయాన్ని( Lord Shiva Temple ) మాత్రం దెయ్యాలు నిర్మించాయి.

వినడానికి ఆశ్చర్యంగా అనిపించినా మన దేశంలోని మహిమాన్వితమైన దేవాలయాలలో ఈ దేవాలయం కూడా ఒకటిగా ఉంది.ఈ ఆలయానికి వందల సంవత్సరాల చరిత్ర ఉంది.

ఈ ఆలయం సైన్స్ కు సైతం అందని రహస్యం అని కొంతమంది భావిస్తారు.దేవుడు ఉన్నాడని నమ్మేవాళ్లలో కొంతమంది దెయ్యాలు కూడా ఉండవచ్చని భావిస్తారు.

కర్ణాటక రాష్ట్రంలోని దొడ్డబళాపురం దేవనహళ్లి మార్గంలోని బొమ్మావర గ్రామంలో ఉన్న శివాలయంను దెయ్యాలు కట్టించాయని చాలామంది భావిస్తున్నారు.ఈ ఆలయంను సుందరేశ్వర ఆలయం( Sundareswara Temple ) అని పిలుస్తారు.

Advertisement

సాధారణంగా దేవాలయం ఎక్కడ ఉన్నా దేవుళ్ల ప్రతిమలు, రాతి శిల్పాలు ఉంటాయి.అయితే సుందరేశ్వర ఆలయంలో మాత్రం రాక్షసుల నమూనాలు కనిపిస్తాయి.600 సంవత్సరాల క్రితం నుంచి ఈ ఆలయం ఉందని భోగట్టా.చాలా సంవత్సరాల క్రితం ఈ గ్రామంలో నివశించే ప్రజలను దెయ్యాలు ఎంతగానో భయపెట్టేవట.

అక్కడి ప్రజలు మాంత్రికుని సూచన మేరకు శివాలయాన్ని నిర్మించడం జరిగింది.

ఆ సమయంలో దెయ్యాలు గుడిని నాశనం చేయగా మాంత్రికుడు దెయ్యాలను వశపరచుకుని కూలదోసిన ఆలయాన్ని మళ్లీ కట్టేలా చేశాడట.ఆ తర్వాత రాత్రికి రాత్రే దెయ్యాలు ఈ ఆలయాన్ని నిర్మించాయి.అప్పటినుంచి ఈ ఆలయాన్ని దెయ్యాలు నిర్మించిన ఆలయం అని పిలుస్తున్నారు.

ఈ ఆలయాన్ని దర్శించుకోవడానికి ఎక్కువ సంఖ్యలో భక్తులు హాజరవుతూ ఉంటారు.కర్ణాటక( Karnataka State ) రాష్ట్రంలోని ప్రముఖ ఆలయాలలో ఈ ఆలయం కూడా ఒకటి కావడం గమనార్హం.

వీడియో వైరల్ : ఇదేందయ్యా ఇది.. ఆవు అక్కడికి ఎలా వెళ్లిందబ్బా..?
తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – జూలై16, మంగళవారం 2024

కర్ణాటకకు వెళ్లిన భక్తులు వీలు కుదిరితే ఈ ఆలయాన్ని దర్శించుకోవడానికి ఇష్టపడతారు.ఈ ఆలయాన్ని దర్శించుకుంటే కోరిన కోరికలు తీరతాయని చాలామంది భావిస్తారు.

Advertisement

తాజా వార్తలు