పనిచేసే సమయంలో ఆన్లైన్ షాపింగ్‌ అంటే ఇలాగే ఉంటుంది... జరా జాగ్రత్త అబ్బాయిలూ!

కరోనా తరువాత కొందరి జీవితం చాలా మారిపోయింది.చాలావరకు ఐటీ సంస్థలు ( IT organizations )నేటికీ వర్క్‌ ఫ్రం హోమ్ కంటిన్యూ చేస్తున్నాయి.

 Online Shopping While Working Is Like This Be Careful Guys,  Viral Latest, News-TeluguStop.com

దాంతో ఐటీ ఉద్యోగులు దాదాపుగా ఇంటి నుంచే పనిచేసుకుంటున్నారు.అంతేకాకుండా చాలామంది ఇపుడు ఆన్‌లైన్ షాపింగ్ వైపే మొగ్గు చూపుతున్నారు.

ఇపుడు పల్లెటూళ్లకు కూడా డెలివరీ ఫెసిలిటీ ఉండడంతో ఉద్యోగులే కాకుండా గృహిణులు స్టూడెంట్స్ ఎంతోమంది ఆన్లైన్ మాధ్యమం ద్వారానే షాపింగ్స్ చేస్తున్న పరిస్థితి.ఈ క్రమంలో తాజాగా ఆన్లైన్ షాపింగ్ విషయమై ఓ పోస్ట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

ఢిల్లీకి చెందిన అమన్ ( Aman) ఓ సాఫ్ట్‌వేర్ డెవలపర్.వర్క్‌ ఫ్రమ్ హోమ్ టైమ్‌లో అతగాడు బాక్సర్ల కోసం ఆన్‌లైన్‌ షాపింగ్ చేశాడు.ఇందు కోసం తన బ్రౌజర్‌లోని ఒక ట్యాబ్‌లో ఈ-కామర్స్ సైట్‌ను ఓపెన్‌ చేయడం జరిగింది.అయితే వర్చువల్ ఆఫీస్ మీటింగ్ సమయంలో తన స్క్రీన్‌ను షేర్ చేయమని అడిగినప్పుడు, అతను అనుకోకుండా షాపింగ్ పేజీకి సంబంధించిన ట్యాబ్‌ను షేర్‌ చేయడం జరిగింది.

ఇంతలో దురదృష్టవశాత్తూ స్క్రీన్ స్ట్రక్‌ అయిపోయింది.

ఇంకేముంది, కట్ చేస్తే అతని ఆన్‌లైన్‌ చెడ్డీల షాపింగ్‌ వ్యవహారం అందరికీ తెలిసిపోయింది.వర్చువల్ ఆఫీస్ మీటింగ్‌లో ( virtual office meeting )పాల్గొన్న అతని సహోద్యోగులు స్క్రీన్‌ మార్చరా నాయనా? అని ఎన్ని ఇన్‌కాల్‌ మెసేజ్‌లు పెట్టినా లాభం లేకోపోయింది.దాంతో వర్క్‌ టైమ్‌లో జరిగిన ఈ పొరపాటు గురించి అమన్‌ సరదాగా ట్విటర్‌లో పేర్కొన్నాడు.

ఈ సందర్భంగా తన సహోద్యోగుల నుంచి వచ్చిన సందేశాల స్క్రీన్‌షాట్‌లను షేర్ చేశాడు.వర్క్‌టైమ్‌లో ఆన్‌లైన్‌ షాపింగ్‌ వంటి ఇతర వ్యాపకాలు పెట్టుకుంటే పర్యవసానాలు ఎలా ఉంటాయో చెప్పకనే చెప్పాడు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube