టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీపై ఆందోళనలు కొనసాగుతున్నాయి.ఈ వ్యవహారంపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపి, నిందితులను కఠినంగా శిక్షించాలని రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థి సంఘాలు నిరసన కార్యక్రమాలు చేపట్టారు.
ఇందులో భాగంగానే టీఎస్పీఎస్సీ కార్యాలయాన్ని ముట్టడించేందుకు ఏవీబీపీ శ్రేణులు ప్రయత్నించారు.ఈ క్రమంలోనే ఆఫీస్ లోపలికి చొచ్చుకొని వెళ్లేందుకు ఏబీవీపీ కార్యకర్తలు ప్రయత్నించారు.
ఈ క్రమంలో వారిని పోలీసులు అడ్డుకుని అరెస్ట్ చేశారు.ఏబీవీపీ ఆందోళనలతో నాంపల్లి రోడ్డులో భారీగా ట్రాఫిక్ జామ్ కావడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.