అనుష్క మరో హీరోయిన్‌ ఓరియంటెడ్‌

అనుష్క వరుసగా హీరోయిన్‌ ఓరియంటెడ్‌ చిత్రాలకు గ్రీన్‌ సిగ్నల్‌ చేస్తూ వస్తోంది.

ఈ అమ్మడు ‘అరుంధతి’ చిత్రం మొదలు నిన్నటి ‘రుద్రమదేవి’, త్వరలో రాబోతున్న ‘సైజ్‌ జీరో’ చిత్రాలతో తెగ సందడి చేస్తోంది.

ఈమె వద్దకు పలు హీరోయిన్‌ ఓరియంటెడ్‌ సబ్జెక్ట్స్‌ వస్తూనే ఉన్నాయి.ఆ మధ్య ‘పిల్ల జమీందార్‌’ ఫేం అశోక్‌ దర్శకత్వంలో యూవీ క్రియేషన్స్‌లో అనుష్క హీరోయిన్‌గా ‘భాగమతి’ అనే చిత్రం తెరకెక్కబోతుంది అంటూ ప్రచారం జరిగిన విషయం తెల్సిందే.

ఆ సినిమాపై ఇంకా ఒక క్లారిటీ రాకుండానే ఈమె వద్దకు మరో భారీ హీరోయిన్‌ ఓరియంటెడ్‌ చిత్రం వచ్చింది.ప్రముఖ నిర్మాత దిల్‌రాజు ఈ చిత్ర ప్రపోజల్‌ను అనుష్క వద్దకు తీసుకు వెళ్లినట్లుగా తెలుస్తోంది.

స్టోరీ లైన్‌ను అనుష్కకు ఇప్పటికే చెప్పడం జరిగిందని, పూర్తి స్క్రిప్ట్‌ వచ్చిన తర్వాత అనుష్క తన నిర్ణయాన్ని చెబుతాను అంటూ దిల్‌రాజుతో చెప్పినట్లుగా తెలుస్తోంది.ప్రస్తుతం అనుష్క కోసం ఒక హీరోయిన్‌ ఓరియంటెడ్‌ స్క్రిప్ట్‌ను రెడీ చేయిస్తున్నాడు.

Advertisement

అతి త్వరలోనే ఆ సినిమాకు సంబంధించిన అధికారికంగా క్లారిటీ వచ్చే అవకాశాలున్నాయి.దిల్‌రాజు నిర్మాణంలో అనుష్క హీరోయిన్‌ ఓరియంటెడ్‌ చిత్రం అంటే అది తప్పకుండా భారీగా ఉండే అవకాశాలున్నాయి.

కథల ఎంపికలో దిల్‌రాజుకు మంచి నైపుణ్యం ఉంది.దాంతో అనుష్క కోసం మంచి కథను ఎంపిక చేసి ఉంటాడు అని ఆమె అభిమానులు భావిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు