తెలుగు సినీ ప్రేక్షకులకు టాలీవుడ్ పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.బాహుబలి సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా మారిన ప్రభాస్ ప్రస్తుతం వరుసగా పాన్ ఇండియా ప్రాజెక్టులలో నటిస్తూ బిజీ బిజీగా ఉన్న విషయం తెలిసిందే.
ఈ క్రమంలోనే ప్రభాస్ ప్రస్తుతం సలార్, ప్రాజెక్ట్ కే, స్పిరిట్, ఆది పురుష్ లాంటి సినిమాలలో నటిస్తూ బిజీ బిజీగా ఉన్నాడు.ఇకపోతే ప్రభాస్ నటించిన రాధే శ్యామ్ సినిమా గత ఏడాది విడుదల అయ్యి ఊహించని విధంగా డిజాస్టర్ గా నిలిచిన విషయం తెలిసిందే.
దీంతో ప్రభాస్ అభిమానులు తదుపరి సినిమా ఆది పురుష్ పై భారీగా అంచనాలు పెట్టుకున్నారు.కానీ గత ఏడాది విడుదలైన ఈ సినిమా టీజర్ ఊహించని విధంగా పెద్ద ఎత్తున ట్రోల్స్, విమర్శలను ఎదుర్కొన్న విషయం తెలిసిందే.
దీంతో ఈ సినిమాను మరొకసారి రీ షూటింగ్ చేసే పనిలో పడ్డారు చిత్ర బృందం.హీరో ప్రభాస్ నటిస్తున్న సినిమాలలో ప్రాజెక్ట్ కే సినిమా కూడా ఒకటి.ఈ సినిమాను వైజయంతి మూవీస్ బ్యానర్ పై నిర్మిస్తున్న విషయం తెలిసిందే. డైరెక్టర్ నాగ్ అశ్విన్ ఈ సినిమాను ఎంతో పగడ్బందీగా ఈ సినిమాకు సంబంధించిన ఎటువంటి చిన్న లీక్స్ కూడా బయటకు రాకుండా ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు.
రాజమౌళి లాంటి స్టార్ డైరెక్టర్ లకే బాహుబలి, ఆర్ఆర్ఆర్ సినిమా విషయంలో లీకుల బెడద తప్పలేదు.కానీ డైరెక్టర్ నాగ్ అశ్విన్ మాత్రం ఈ ప్రాజెక్టు కే సినిమా నుంచి ఎటువంటి లీక్స్ బయటికి రాకుండా చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
అయితే లీకుల విషయంలో జాగ్రత్తలు ఓకే కానీ కనీసం ప్రభాస్ కి సంబంధించిన ఒక సైడ్ ఫేస్ చూపించిన చాలు డార్లింగ్ అభిమానులు ఫుల్ ఖుషి అవుతారు.
ఇప్పటివరకు కేవలం కాళ్లు చేతులు నీడలు తప్పితే ప్రభాస్ ముఖాన్ని కూడా ఇంతవరకు చూపించలేదు.ఇకపోతే ప్రాజెక్ట్ కే సినిమాలో అమితాబ్ బచ్చన్ కీలక పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే.ఇకపోతే అమితాబచ్చన్ ఇంటి ముందు ప్రతి ఆదివారం కూడా ఎంతోమంది అభిమానులు అమితాబచ్చన్ ను చూడడానికి ఎదురు చూస్తూ ఉంటారు.
అభిమానులకు కనిపించే అందరికీ హాయ్ చెప్పడం అమితాబ్ బచ్చన్ కి అలవాటు.ఈ నేపథ్యంలో తాజాగా అమితాబ్ బచ్చన్ తన ఇంటి ముందు ఎదురుచూస్తున్న అభిమానులను కలిశాడు.
ఇక అప్పుడు అమితాబ్ బచ్చన్ ప్రాజెక్ట్ కే సినిమాకు సంబంధించిన టీ షర్టును ధరించాడు.అందుకు సంబంధించిన ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో డార్లింగ్ ఫాన్స్ ఆ ఫోటో కింద పెద్ద ఎత్తున కామెంట్స్ చేస్తున్నారు.
ప్రాజెక్టుకి సంబంధించిన చిన్న అప్డేట్ ని అయినా విడుదల చేయండి నాగ అశ్విన్ బ్రో అంటూ కామెంట్ సెక్షన్ లో వారి బాధను వెల్లడిస్తున్నారు ప్రభాస్ అభిమానులు.మరి అభిమానుల రిక్వెస్ట్ ని మన్నించి నాగ అశ్విన్ ఏదైనా అప్డేట్ ను విడుదల చేస్తాడేమో చూడాలి మరి.