యాదాద్రి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం ఒకరు మృతి...!

యాదాద్రి భువనగిరి జిల్లా: తుర్కపల్లి మండలం మాదాపూర్ పెట్రోల్ పంప్ వద్ద ఆదివారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో మాదాపూర్ గ్రామానికి చెందిన జలిగం రాజు (30) అక్కడికక్కడే మృతి చెందగా,మేకల శ్రీకాంత్ కు తీవ్ర గాయాలయ్యాయి.

యాదగిరిగుట్ట డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు బైక్ ను ఢీ కొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది.

తీవ్రంగా గాయపడిన మేకల శ్రీకాంత్ ను హుటాహుటిన 108 అంబులెన్స్ లో భువనగిరి ప్రభుత్వ ఏరియా ఆస్పత్రికి తరలించారు.బైక్ పై వెళుతున్న వీరిద్దరూ మాదాపూర్ గ్రామానికి చెందిన వారు కావడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం భువనగిరి ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించి,కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

రైతులు ఎవరూ ఆందోళన చెందవద్దు : రాష్ట్ర మంత్రులు
Advertisement

Latest Latest News - Telugu News