ఏ పార్టీకి అయినా మనుగడ సాగాలంటే పది మందికి చెప్పే విధంగా అందులోని నేతలు ఉండాలి.లేదంటే విమర్శలు వారికి కామన్ అయిపోతాయి.
అంతే కాదు జనాల్లో కూడా వారు చులకన అయిపోతారు.ఇక ఎన్నో అంచనాల నడుమ తెలంగాణలో పార్టీని పెట్టిన వైఎస్ షర్మిల మాత్రం ఎన్ని విమర్శలు వచ్చినా తన పంతా మాత్రం మార్చుకోవట్లేదనే చెప్పాలి.
ఇప్పటికే ఆమెపై నెటిజన్లు ఛాన్స్ దొరికితే ఆడేసుకుంటున్నారు.మరి అలాంటి టైమ్‌లో ఆమె ఇంకెంత జాగ్రత్తగా ఉండాలని చాలామంది జాగ్రత్తలు చెబుతున్నా ఆమె మాత్రం అదే తీరులో పనిచేస్తున్నారు.
ఇక తాజాగా ఆమె ఈరోజు లోటస్ పాండ్‌లోని టీమ్ వైఎస్సార్ వెబ్‌సైట్ ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు.అయితే మొదటి నుంచి ఆమె కరోనా గురించి చెబుతున్నారు.కేసీఆర్ కరోనా ట్రీట్‌మెంట్‌ను ఆరోగ్య శ్రీలో చేర్చట్లేదని పొద్దున లేస్తే విమర్శించే షర్మిల మాత్రం కరోనా రూల్స్ ను పక్కన పెట్టారు.ఈ వెబ్ సైట్ ప్రారంభోత్సవంలో ఆమె మాస్కు లేకుండానే పాల్గొన్నారు.
అంతే కాదు ప్రతి ఒక్కరితో సోషల్ డిస్టెన్స్ కూడా మరిచి మంతనాలు జరపడం ఆమెను మరోసాది వివాదంలోకి తీసుకెళ్లింది.

ఇక ఆ ఫొటోలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి.ఇప్పటికే ఛాన్స్ దొరికితే ప్రతి చిన్న విషయాన్నిఅవకాశంగా తీసుకుంటున్న బీజేపీ కార్యకర్తలు ఆమెను మరోసారి ట్రోల్ చేస్తున్నారు.పదిమందికి చెప్పే స్థాయిలో ఉండే షర్మిల ఇలా కొన్ని విషయాల్లో మాత్రం అన్నీ మర్చిపోయి వ్యవహరించడం ఆమెకు ఇబ్బందులు తీసుకొస్తోంది.
మరి ఆమె ఇకనైనా తన చుట్టూ పాజిటివ్ వేవ్ ఉండేలా చూసుకుంటారో లేదో అని కార్యకర్తల్లో ఆవేదన తలెత్తుతోంది.ఆమెకు ఇప్పటికే ఎంతో మంది ఇలాంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండాలని చెబుతున్నా ఆమె మాత్రం వాటిని లెక్క చేయట్లేదనే విమర్శలు ఆమె అభిమానుల్లో కూడా ఉంది.
చూడాలి మరి షర్మిల ఇకనైనా ఇలాంటి విషయాల్లో జాగ్రత్త పడతారో లేదో అని.