మళ్లీ సీఎం జగన్ ప్రయాణిస్తున్న విమానానికి సాంకేతిక లోపం..!!

Once Again CM Jagan's Plane Has A Technical Fault , G20 Summit, AP CM YS Jagan, Vishakapatnam

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్( YS Jagan ) నేడు జీ20 సదస్సుకు హాజరయ్యేందుకు సాయంత్రం గన్నవరానికి చేరుకున్నారు.అయితే ప్రయాణించాల్సిన విమానంలో సాంకేతిక లోపం గుర్తించడంతో దాదాపు అరగంట పాటు విమానాశ్రయంలోనే సీఎం జగన్ వేచి చూడడం జరిగింది.

 Once Again Cm Jagan's Plane Has A Technical Fault , G20 Summit, Ap Cm Ys Jagan,-TeluguStop.com

అయినప్పటికీ సమస్య పరిష్కారం కాకపోవటంతో విశాఖ వెళ్లకుండానే సీఎం జగన్ తిరిగి తాడేపల్లి నివాసానికి వెళ్లిపోయారు.గతంలో ఢిల్లీ( Delhi ) వెళుతున్న సమయంలో ఈ రీతిగానే ఫ్లైట్ లో సాంకేతిక లోపం ఏర్పడింది.

ఢిల్లీ వెళ్లే మధ్యదారిలో… ఎయిర్ హోస్టర్స్ గుర్తించడంతో… వెంటనే మళ్ళీ వెనక్కి చేరుకున్నారు.

ఆ తర్వాత హైదరాబాదు( Hyderabad ) నుండి మరో ప్రత్యేక విమానం ఏర్పాటు చేసి అక్కడ నుండి గన్నవరంకి ఆ విమానం చేరుకున్న తర్వాత దానిలో జగన్ బయలుదేరడం జరిగింది.కాగా ఇప్పుడు మరోసారి విశాఖ వెళ్లాల్సిన సమయంలో ప్రయాణించాల్సిన విమానంలో సాంకేతిక లోపం ఏర్పడటంతో.పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

విశాఖలో జీ20 సదస్సును( G20 summit ) ఏపీ ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది.విశాఖపట్నంలో రెండు రోజులపాటు ఈ సదస్సు జరగనుంది.

దాదాపు 69 మంది విదేశీ ప్రతినిధులు హాజరు కావడం జరిగింది.ఈ క్రమంలో షెడ్యూల్ ప్రకారం నేడు సాయంత్రం సీఎం జగన్.

సదస్సులో హాజరు కావలసి ఉండగా విమాన సాంకేతిక లోపంతో… విశాఖ వెళ్లకుండానే.వెనుతిరిగి తాడేపల్లికి వెళ్లిపోవడం సంచలనంగా మారింది.

Video : Once Again CM Jagan's Plane Has A Technical Fault G20 Summit, AP CM YS Jagan, Vishakapatnam. #TeluguStopVideo

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube