మార్చి నెలలో ఈ తేదీన ఉత్సవాలకు ముస్తాబైన సిద్దయ్య మఠం..

జగద్గురు శ్రీ మద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామికి( Potuluri VeeraBrahmendra Swamy ) ఎంతో ఇష్టమైన శిష్యుడు సిద్దయ్య స్వామి ( Siddaiah Swamy )కొలువైన మఠం ఉత్సవాలకు ఎంతో అందంగా ముస్తాబు అయింది.

మండలంలోని ముడుమాలలో ఈ మఠం ఉంది.

అయితే సిద్దయ్య స్వామి కుమారుడు పెద్ద పీరయ్య స్వామి ( Peeraiah Swami )ఆరాధన మహోత్సవాలు బుధవారం నుంచి రెండు రోజుల పాటు అంగరంగ వైభవంగా నిర్వహించనున్నారు.ఇంకా చెప్పాలంటే బుధవారం ఉదయం పెద్ద పిరయ్య స్వామికి పూల పూజ ప్రత్యేక వస్త్రాలంకరణ కార్యక్రమాలను చేస్తారు.

అంతే కాకుండా రాత్రి గ్రామ ఉత్సవం, భజనలు, డ్రామాలు, అన్నదానాలు కూడా ఉంటాయి.ముఖ్యంగా చెప్పాలంటే గురువారం మహా ప్రసాద వినియోగం ఉంటుంది.

బండలాగుడు పోటీలను కూడా నిర్వహిస్తారు.బండలాగుడు పోటీల విజేతలకు బహుమతులను కూడా అందజేస్తారు.

Advertisement
On This Date In The Month Of March, The Siddaiah Math Is Suitable For Festivals

ఉదయం చిన్న బండలాగుడు పోటీలు ఉంటాయి.మొదటి, రెండు, మూడు, నాలుగు, బహుమతులు వరుసగా రూ.30,016,రూ.20,016, రూ.15,016,రూ.5,016 మొదటి నుంచి వరుసగా నాలుగు బహుమతులుగా ఇవ్వనున్నారు.

On This Date In The Month Of March, The Siddaiah Math Is Suitable For Festivals

ఇంకా చెప్పాలంటే మధ్యాహ్నం పెద్ద బండ పోటీలు జరుగుతాయి.మొదటి, రెండు, మూడు, నాలుగు, ఐదువ బహుమతులు వరుసగా రూ.75,016, రూ.50,016, రూ.30,016, రూ.15,116, రూ.10,116 వరుసగా మొదటి నుంచి వరుసగా ఐదు వరకు బహుమతులను అందజేస్తారు.మనుముల గుండు ఎత్తే పోటీలను కూడా నిర్వహిస్తారు.

విజేతలకు బహుమతులను ప్రధానం చేస్తారు.

On This Date In The Month Of March, The Siddaiah Math Is Suitable For Festivals

ముఖ్యంగా చెప్పాలంటే శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి చాలా సంవత్సరాల క్రితం సిద్దయ్యకు ఇచ్చిన గురు కానుకలను భక్తుల దర్శనం కోసం ఉంచనున్నారు.శిఖముద్రిక, యోగ దండన, తాళ్లపత్రాలు ఉగాది సందర్భంగా బుధవారం భక్తుల దర్శనం కోసం ఉంచుతారు.వాటిని దర్శించుకునేందుకు భక్తులు అధిక సంఖ్యలో తరలి వచ్చే అవకాశం ఉందని మఠం నిర్వాహకులు చెబుతున్నారు.

నా హైట్ తో సమస్య.. నాతో మాట్లాడేవాళ్లు కాదు.. మీనాక్షి చౌదరి షాకింగ్ కామెంట్స్ వైరల్!
మలబద్ధకాన్ని తరిమికొట్టే బెస్ట్ డ్రింక్స్ ఇవి.. రోజు తీసుకుంటే మరెన్నో లాభాలు!

ఉత్సవాల కోసం మఠాధిపతులు, శిష్య బృందం ఆధ్వర్యంలో ఏర్పాట్లు అన్ని పూర్తి చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు