బుల్లితెర యాంకర్లలో ఒకరైన ఓంకార్ ప్రోమోల ద్వారా, ట్విస్ట్ ల ద్వారా తను యాంకరింగ్ చేసే రియాలిటీ షోలు హిట్ అయ్యేలా జాగ్రత్త పడుతుంటారు.ఓంకార్ ప్రస్తుతం డ్యాన్స్ ప్లస్ అనే డ్యాన్స్ షోకు యాంకర్ గా వ్యవహరిస్తున్నారు.
ఈ షో మంచి టీఆర్పీ రేటింగ్ లను సొంతం చేసుకోవడంతో పాటు ప్రేక్షకులకు కావాల్సిన ఎంటర్టైన్మెంట్ ను అందిస్తోంది.ఏ మాత్రం పాపులారిటీ లేని షోను కూడా తన ప్రతిభతో హిట్ చేసే ఓంకార్ తాజాగా విడుదలైన ప్రోమోలో ముమైత్ ఖాన్ పరువు తీశారు.
డ్యాన్స్ ప్లస్ షోలో ఒక కంటెస్టెంట్ డ్యాన్స్ సరిగ్గా చేయకపోవడంతో ముమైత్ ఆ కంటెస్టెంట్ డ్యాన్స్ పై కామెంట్లు చేయగా ఆ కంటెస్టెంట్ రివర్స్ లో కౌంటర్లు ఇచ్చారు.కంటెస్టెంట్ కౌంటర్లు ఇవ్వడంతో ముమైత్ సీరియస్ అయ్యారు.
ఆ తరువాత ఓంకార్ ముమైత్ ఖాన్ ను ఎందుకు సీరియస్ అవుతున్నారని ప్రశ్నించారు.కోపాన్ని కంట్రోల్ చేసుకోవాలని ఓంకార్ ముమైత్ కు సూచనలు చేశారు.
ఆ కంటెస్టెంట్ కొరియోగ్రఫర్ గా బాధను చెప్పుకుంటున్నాడని మీరు మాట్లాడాలే తప్ప నన్ను పాయింట్ ఔట్ చేయొద్దని ముమైత్ కు ఓంకార్ చెప్పారు.
మీరూ మీరూ గొడవ పడి తనను టార్గెట్ చేయవద్దని ఓంకార్ పరోక్షంగా చెప్పారు.నేను తప్పు చేస్తే నన్ను పాయింట్ ఔట్ చేయాలని లేకపోతే నన్ను పాయింట్ ఔట్ చేయొద్దని ఓంకార్ పేర్కొన్నారు.శనివారం, ఆదివారం రాత్రి 9 గంటలకు స్టార్ మా ఛానెల్ లో ఈ షో ప్రసారం కానుంది.
వివాదాల ద్వారా ఓంకార్ డ్యాన్స్ ప్లస్ షోపై హైప్ పెంచే ప్రయత్నం చేస్తున్నారు.గతంలో ఓంకార్ హోస్ట్ చేసిన ఎన్నో షోలు వివాదాల ద్వారా వార్తల్లొ నిలిచిన సంగతి తెలిసిందే.
ఓంకార్ తన షోలలో ఎన్నో ప్రయోగాలు చేస్తూ ప్రోమోల ద్వారానే బజ్ క్రియేట్ అయ్యేలా జాగ్రత్త పడుతున్నారు.డ్యాన్స్ షోలను ఇష్టపడే వారిని డ్యాన్స్ ప్లస్ షో ఎంతగానో ఆకట్టుకుంటోంది.