మేడిగడ్డ వంతెన కుంగిపోవడంతో అధికారుల అలర్ట్

జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం ప్రాజెక్ట్ మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజ్ వంతెన కుంగిపోయిన నేపథ్యంలో ఇరిగేషన్ శాఖ అధికారులు అప్రమత్తం అయ్యారు.ఈ క్రమంలో 48 గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్న విషయం తెలిసిందే.

 Officials Alert As Medigadda Bridge Collapses-TeluguStop.com

ఈ నేపథ్యంలోనే భద్రాద్రి కొత్తగూడెం, ములుగు జిల్లాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు.గోదావరి పరివాహక ప్రాంతాలు అయిన వాజేడు, వెంకటాపురం మండలాలకు భారీగా వరద నీరు చేరే అవకాశం ఉంది.

దీంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.అయితే వంతెన కుంగిపోవడానికి సంఘ విద్రోహ శక్తులే కారణమనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

ఈ క్రమంలోనే లక్ష్మీ బ్యారేజ్ వద్ద పోలీసులు భారీగా మోహరించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube