కొడుకా ఎక్కడున్నావంటూ శవాల మధ్య వెతుకుతున్న తండ్రి.. కన్నీళ్లు తెప్పించేలా?

కోరమాండల్ ఎక్స్ ప్రెస్ రైలు( Coromandel Express Train ) ప్రమాద ఘటనలో మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది.ఇప్పటివరకు ఈ ప్రమాదంలో 288 మంది మృతి చెందారు.

 Odisha Train Accident Shocking Details Here Goes Viral In Social Media  , Odisha-TeluguStop.com

ఎలక్ట్రానిక్ ఇంటర్ లాకింగ్ లో మార్పు వల్లే ఈ రైలు ప్రమాదం జరిగిందని వెల్లడైంది.బాధ్యులను సైతం గుర్తించామని పూర్తి నివేదికను సమర్పించాల్సి ఉందని అధికారులు చెబుతున్నారు.

ప్రస్తుతం రైల్వే శాఖ పునరుద్ధరణ పనులపై ప్రధానంగా దృష్టి పెట్టింది.

బుధవారం ఉదయానికి పనులు పూర్తవుతాయని ఆ తర్వాత రైళ్ల రాకపోకలు తిరిగి ప్రారంభమవుతాయని తెలుస్తోంది.

అయితే ఈ రైలు ప్రమాదంలో భద్రక్ జిల్లా సుగో గ్రామానికి చెందిన ఒక వృద్ధుడి కొడుకు ప్రయాణించాడు.రైలు ప్రమాదం తర్వాత ఈ వృద్ధుడికి తన కొడుకుకు సంబంధించిన సమాచారం అందలేదు.

బాలేశ్వర్ కు చేరుకున్న ఈ వృద్ధుడు వెక్కివెక్కి ఏడుస్తూ తన కొడుకుకు సంబంధించిన సమాచారం చెప్పాలని కోరాడు.

కొడుకా ఎక్కడున్నావంటూ శవాల మధ్య తండ్రి వెతుకున్న వీడియో నెటిజన్లకు కన్నీళ్లు తెప్పిస్తోంది.మృతదేహాలు ఉన్న చోటుకు వెళ్లిన ఆ వృద్ధుడు కొడుకు ఆచూకీ కోసం గాలిస్తున్నాడు.తన కొడుకు క్షేమంగా ఉన్నాడనే వార్తను వినాలని ఆ వృద్ధుడు కోరుకుంటున్నాడు.

కోరమాండల్ ఎక్స్ ప్రెస్ రైలు ప్రమాదం నేపథ్యంలో ఇలాంటి ఘటనలు రిపీట్ కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కామెంట్లు వినిపిస్తున్నాయి.

రైల్వే శాఖలో పని చేస్తూ నిర్లక్ష్యంగా వ్యవహరించే సిబ్బంది విషయంలో అధికారులు చర్యలు తీసుకోవడానికి సిద్ధమవుతున్నారు.కోరమాండల్ ఎక్స్ ప్రెస్ లో ప్రయాణించిన ప్రయాణికులలో 309 మంది ఏపీకి చెందిన వారు ఉన్నారు.ఏపీకి చెందిన 11 మంది జాడ ఇప్పటివరకు దొరకలేదని తెలుస్తోంది.

ఒడిశా రైలు ప్రమాదం నేపథ్యంలో రైల్వే శాఖ అప్రమత్తం కావడంతో పాటు రాబోయే రోజుల్లో ఈ తరహా ఘటనలు జరగడానికి ఎలాంటి అవకాశం ఇవ్వకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube