భారత్ 2023 ప్రపంచ కప్( World Cup ) ను కోల్పోయిన తర్వాత అనేక రకాల వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉన్నాయి.ఆట ఆడిన విధానం, ఓడిన విధానం, బాధపడిన విధానం ప్రతి ఒక్కరిని కంటతడి పెట్టిస్తుంది.
స్టేడియంలో ఆటగాళ్లు ఎదుర్కొనే ప్రతి బాల్ అలాగే విసిరుతున్న బంతి, పట్టుకుంటున్న క్యాచ్ లు అభిమానుల్లో ఆసక్తిని ఆసాంతం రెట్టింపు చేశాయి.ఇక గత నాలుగు వరల్డ్ కప్ అందుకున్న టీం కెప్టెన్ల విషయానికొస్తే ప్రతిసారి ఒక పాయింట్ కామన్ గా కనిపిస్తుంది.ఏ వరల్డ్ కప్ అయితే గెలుచుకుంటుందో ఆ టీం కి సంబంధించిన క్యాప్టెన్ పెళ్లయిన వెంటనే ఆ కప్పును అందుకోవడం విశేషం మరి అసలు కథ నాలుగు ప్రపంచ కప్ లు గెలుచుకున్న టీం కెప్టెన్సీ ఎవరు వారు పెళ్లి ఎప్పుడు జరిగిందని వివరాలను ఈ ఆర్టికల్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
2003 ప్రపంచ కప్

2003 క్రికెట్ వన్ డే ప్రపంచ కప్ ని ఆస్ట్రేలియా టీం నెగ్గింది.ఆ టైంలో ఆ టీం కి కెప్టెన్ గా రికి పాంటింగ్ ఉన్నాడు.ఆశ్చర్యకరంగా 2002వ సంవత్సరంలోనే రికీ పాంటింగ్ పెళ్లి ( Ricky Ponting )చేసుకున్నాడు పెళ్లి చేసుకున్న ఏడాదికే ప్రపంచ కప్ గెలుచుకున్నాడు.
2011 ప్రపంచ కప్

2011 క్రికెట్ వన్డే ప్రపంచ కప్ మీ ఇండియా సొంత చేసుకున్న విషయం మనందరికీ తెలిసిందే ఈ టైంలో ఇండియాకి ఎంఎస్ ధోని కెప్టెన్ గా ఉన్నాడు ఈసారి కూడా ఒక ఏడాది ముందు అంటే 2010లో ఎంఎస్ ధోని వివాహం( MS dhoni ) చేసుకున్నాడు ఆ తర్వాత ఏడాదికి ప్రపంచకప్ ని ఇండియా నేగ్గింది.
2019 ప్రపంచ కప్
ఈసారి కూడా ఇంతకుముందు జరిగినట్టుగానే ఆశ్చర్యకరంగా ప్రపంచ కప్ నెగ్గిన ఇంగ్లాండ్ జట్టు కెప్టెన్ ఏడిన్ మోర్గాన్ అంతకు ఏడాది ముందే పెళ్లి చేసుకున్నాడు అంటే 2018లో ఎడిన్ వివాహ బంధంలోకి అడుగుపెట్టగా 2019లో ప్రపంచకప్ నెగ్గారు.