చేయని పాపానికి కొందరు బలవుతుంటారు అలాంటి వారిలో నెహ్రూ ఆదివాసీ భార్య ఒకరు.ఆమె ఇటీవల గుండెపోటుతో మరణించారు.
ఆమె లైఫ్ స్టోరీ ఇప్పుడు అందరినీ కలిచి వేస్తోంది.ఫ్లాష్ ప్యాక్ లోకి వెళ్తే, దామోదర నదిపై పాంచెట్ డ్యామ్ పేరిట ఓ జలవిద్యుత్తు ప్రాజెక్టు దాదాపు ఆరు శతాబ్దాల క్రితం అందుబాటులోకి వచ్చింది.1959, డిసెంబరు 6న అప్పటి పీఎం జవహర్ లాల్ నెహ్రూ( Jawaharlal Nehru ) దీనిని ఓపెన్ చేయడానికి వచ్చారు.అతన్ని దామోదర్ వ్యాలీ కార్పొరేషన్ అధికారులు రిసీవ్ చేసుకోవాల్సి ఉంది.
ఆ సమయంలో అధికారులు కొంతమంది ఆదివాసీ మహిళలను కూడా పిలిచారు.నెహ్రూ కి స్వాగతం చెప్పాలని కోరారు.
నిజానికి ఆ ప్రాజెక్టు నిర్మాణంలో కీలక పాత్ర పోషించింది ఈ ఆదివాసీలే.వారు కూలీలుగా అనేక పనులను చేశారు.
వారిలో 15 ఏళ్ల యువతి కూడా ఉంది.ఆమె పేరు బుద్ధిని మంఝిన్.
( Budhni Mejhan ) ఆమె తెగ పేరు సంతాలి.ఈమె, ప్రస్తుత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ( Draupadi Murmu )సేమ్ తెగకు చెందినవారు.
ఈ తెగ ప్రజల కట్టుబాట్లు చాలా స్ట్రిక్ట్ గా ఉంటాయి.ఆ కట్టుబాట్లు తప్పితే వారు జన్మలో క్షమించరు.
అయితే జల విద్యుత్ ప్రాజెక్టు కారణంగా ఆదివాసీల భూమి చాలా పోయిందని నెహ్రూ బాధపడ్డారు.అంతేకాదు ఈ ప్రాజెక్టు కోసం వారు పడ్డ కష్టాన్ని కూడా గుర్తించారు.
ఈ రెండు కారణాల వల్ల ఆ ప్రాజెక్టు వారి వల్లే సాధ్యమైందన్న ఆలోచన ఆయనలో మొదలైంది.అందుకే వారందరికీ ప్రతినిధిగా బుద్ధిని మంఝిన్‌ను ఎంచుకొని ఆమె చేతనే ‘బటన్’ నొక్కించి ప్రాజెక్టు లాంచ్ చేయించారు.

ఆ సమయంలో అక్కడున్న వారందరూ ఈ దృశ్యం చూసి చెవులు చిల్లులు పడేలా చప్పట్లు కొట్టారు.అదే సందర్భంగా ఆమె నెహ్రూ మెడలో దండ వేసింది, దాంతో నెహ్రూ నవ్వుతూ ఈ మర్యాదలు, గౌరవాలు మీకే దక్కాలమ్మా అంటూ ఆ దండను తిరిగి ఆమె మెడలోనే వేశారు.ఆపై షేక్ హ్యాండ్ ఇచ్చారు.దీంతో ఆమె ఎంతో ఉప్పెంగిపోయింది కానీ చివరికి అదే ఆమెకు శాపంగా మారుతుందని ఎన్నడూ ఊహించలేదు.ఆ తెగవారు ఈ యువతి నెహ్రూ మెడలో దండ వేయడం, వేయించుకోవడం, షేక్ హ్యాండ్ ఇవ్వడం, వంటివన్నీ చూసి ఆమె అతనిని పెళ్లి చేసుకుందని ముద్ర వేశారు.తమ తెగ వ్యక్తిని కాకుండా బయట వ్యక్తిని పెళ్లి చేసుకున్నావ్ అంటూ ఆమెను నిందించారు.
నువ్వు అతనికి భార్యవు అయిపోయావ్ అని వెళ్లగొట్టారు.ఆ తెగ వెలివేసిన ఈ అమ్మాయిని ఎవరూ పెళ్లి చేసుకోవడానికి ముందుకు రాలేదు.
దామోదర్ వ్యాలీ కార్పొరేషన్ కూడా మూడేళ్ల తర్వాత ఆమెను ఉద్యోగం నుంచి తీసేసింది.

చివరికి బతుకుతెరువు కోసం బెంగాల్‌లోని పురూలియాకు వెళ్లి సుధీర్ దత్తా అనే యువకుడితో సహజీవనం చేసింది.పెళ్లి చేసుకోవాలన్నా అది కుదరక ఆ పని చేసింది.ఫలితంగా ఒక బిడ్డ పుట్టింది.
ఆమెకు ఇటీవలే పెళ్లి చేసింది.బిడ్డ, ఆమె భర్త వద్ద మొన్నటిదాకా బతుకు సాగించింది.
శుక్రవారం నాడు ఆమె గుండెపోటుతో మరణించింది.అయితే ఆమె తుదిశ్వాస విడిచేంతవరకు ఆ తెగవారు ఆమెను క్షమించలేదు.
తమ తెగలోకి అస్సలు ఆహ్వానించలేదు.ఆమె చనిపోవడానికి కొన్నేళ్లకు ముందు రాజీవ్ గాంధీ ( Rajiv Gandhi )ఆమె గురించి విని చాలా చెలించిపోయారు.
ఆమెకు ఒక ఉద్యోగం ఇవ్వాలని దామోదర్ వ్యాలీ కార్పొరేషన్‌కు ఆదేశాలు కూడా జారీ చేశారు అందువల్ల ఆమె జాబ్ తెచ్చుకోగలిగింది.