ఆ భయంతోనే మళ్ళీ హీరోయిన్ గా నటించలేదంటున్న వెంకటేష్ చెల్లెలు...

తెలుగులో ప్రముఖ దర్శకుడు కె.

విజయభాస్కర్ దర్శకత్వం వహించిన "నువ్వే కావాలి" చిత్రంలో రెండో హీరోయిన్ గా నటించి ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్న టాలీవుడ్ ప్రముఖ క్యారెక్టర్ ఆర్టిస్ట్ "మాధవి అలియాస్ వర్ష" గురించి సినీ ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.

 అయితే వర్ష అసలు పేరు మాధవి కానీ నువ్వే కావాలి చిత్రంలో దర్శకుడు విజయభాస్కర్ ఆమె పేరుని  వర్ష అని పెట్టడంతో ఆ పేరు మాధవికి చాలా బాగా నచ్చిందట. దీంతో దర్శక నిర్మాతలు కూడా ఇప్పటి నుంచి తన పేరు వర్ష గా మార్చుకోమని సలహా ఇచ్చారట.

 కాగా తాజాగా ఓ ప్రముఖ ఛానల్ నిర్వహించిన ఇంటర్వ్యూలో వర్ష పాల్గొని తన సినీ జీవితం గురించి పలు ఆసక్తికర అంశాలను ప్రేక్షకులతో పంచుకుంది.అయితే ఇందులో తాను ఆరో తరగతి చదువుతున్నప్పుడే "పంజరం" సినిమాలో హీరోయిన్ గా నటించిన మీనా చెల్లెలి పాత్రలో నటించే అవకాశం వచ్చిందని, ఆ చిత్రంలో నటించిన తర్వాత కొంతకాలం పాటు సినిమాలకు దూరంగా ఉన్నానని తెలిపింది.

ఆ తర్వాత  పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించినటువంటి సుస్వాగతం చిత్రంలో హీరోయిన్ దేవయాని స్నేహితురాలి పాత్ర ద్వారా మళ్లీ తన సినీ ప్రయాణం మొదలైందని చెప్పుకొచ్చింది.అనంతరం "నువ్వే కావాలి" చిత్రంలో రెండో హీరోయిన్ గా నటించిన తర్వాత తనకి పలు చిత్రాలలో హీరోయిన్ గా నటించే అవకాశాలు వచ్చినప్పటికీ తన సినీ కెరీర్ ని దృష్టిలో ఉంచుకుని భయపడి హీరోయిన్ గా నటించే లేక పోయానని చెప్పుకొచ్చింది.

Advertisement

కానీ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా తాను నటించినటువంటి ప్రతి  చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి విజయం సాధించిందని అందుకుగాను తనకు చాలా ఆనందంగా ఉందని పేర్కొంది.

అయితే పెళ్లయిన తర్వాత తన పూర్తి సమయం కుటుంబ బాధ్యతలను చక్కదిద్దడానికి కేటాయించానని అందువల్లనే సినిమాలలో పెద్దగా నటించలేక పోయానని కూడా తెలిపింది.తన పాత్రకి ప్రాధాన్యత ఉన్నటువంటి అవకాశం వస్తే ఖచ్చితంగా మళ్లీ సినిమాల్లో నటిస్తానని స్పష్టం చేసింది. కాగా తన భర్త యానిమేషన్ కి సంబంధించినటువంటి సంస్థని నడుపుతున్నాడని,  దీంతో అప్పుడప్పుడు తాను కూడా తన భర్తకు చేదోడువాదోడుగా నిలుస్తున్నానని తెలిపింది.

  తన మొత్తం సినీ ప్రయాణంలో దాదాపుగా 30 కి పైగా చిత్రాలలో మరియు  8 కి పైగా సీరియల్లో హీరోయిన్ పాత్రలలో నటించానని చెప్పుకొచ్చింది.

అందివచ్చిన అవకాశాన్ని ఈ ఇద్దరు హీరోయిన్స్ ఉపయోగించుకుంటారా ?
Advertisement

తాజా వార్తలు