NTR : ఆ విషయంలో హాలీవుడ్ స్టార్స్ ను వెనక్కి నెట్టిన ఎన్టీఆర్.. అసలేం జరిగిందంటే?

దేశ వ్యాప్తంగానే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు సినిమా ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఆస్కార్ అవార్డు( Oscar Award ) వేడుక ఇటీవలే ముగిసిన విషయం తెలిసిందే.ఆర్ఆర్ఆర్( RRR ) లోని నాటు నాటు పాటకు ఆస్కార్ అవార్డు లభించిన విషయం తెలిసిందే.

 Ntr Was Number One On Top Male Mentions From Oscars 2023-TeluguStop.com

దీంతో ప్రస్తుతం ఎక్కడ చూసినా కూడా ఈ విషయం గురించే చర్చించుకుంటున్నారు.సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు ప్రతి ఒక్కరూ ఈ సినిమాని తెగ మెచ్చుకుంటున్నారు.

కాగా ఈ సినిమాలో నటించిన నందమూరి హీరో జూనియర్ ఎన్టీఆర్( NTR ) ఇప్పటికే ఎన్నో రికార్డులను సాధించిన విషయం తెలిసిందే.ఈ క్రమంలోనే ఎన్టీఆర్ అరుదైన ఘనత సాధించాడు.

ఏకంగా హాలీవుడ్ స్టార్ హీరోలను సైతం వెనక్కి నెట్టి మరీ టాప్ లో నిలిచాడు.ఆ వివరాల్లోకి వెళితే…ఆర్ఆర్ఆర్ సినిమాతో హీరోలు చెర్రీ,తారక్ ఇద్దరు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపుని తెచ్చుకున్న విషయం తెలిసిందే.హాలీవుడ్ స్టార్స్, డైరెక్టర్స్ సైతం ఈ ఇద్దరు హీరోల గురించి మాట్లాడుకున్నారు.ఈ క్రమంలోనే ఆస్కార్ వేడుకలో ఎన్టీఆర్, రామ్ చరణ్ పాల్గొన్నారు.వాళ్ల డ్రస్సింగ్ స్టైల్ నుంచి ప్రతిదీ అందరినీ ఆకట్టుకుంది.ఈ క్రమంలోనే నందమూరి హీరో అరుదైన రికార్డు నెలకొల్పినట్లు తెలుస్తోంది.

ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవం జరుగుతున్న టైంలోనే చరణ్ తారక్ గురించే ఎక్కువగా డిస్కషన్ నడిచింది.అయితే ఇందులో ఎన్టీఆర్ టాప్ లో నిలిచాడు.

చరణ్ రెండో స్థానాన్ని సొంతం చేసుకున్నాడు.

ఎవ్రీథింగ్ నటుడు కె హ్యూయ్ ఖాన్, ఉత్తమ నటుడు బ్రెండన్ ఫ్రేజర్, అమెరికన్ యాక్టర్ పెడ్రో పాస్కల్ తర్వాతి స్థానాల్లో ఉన్నారు.నెట్ బేస్ క్విడ్ అనే డేటా విశ్లేషణ సంస్థ విడుదల చేసిన వివరాల ప్రకారం.ఆస్కార్ వేడుక జరుగుతున్న టైంలో సోషల్ మీడియా, న్యూస్ మీడియాలో అందరికంటే ఎక్కువగా మెన్షన్ చేసిన నటుల్లో జూనియర్ ఎన్టీఆర్ అగ్రస్థానం సొంతం చేసుకున్నాడు.

ఈ విషయాన్ని చెప్పిన సదరు సంస్థ ఓ ఫొటోని కూడా రిలీజ్ చేసింది.అలా ఈసారి ఆస్కార్ వేడుకని సుమారు 18.7 మిలియన్ల మంది చూశారట.కాగా గత ఏడాదితో పోలిస్తే ఈ అవార్డుల కార్యక్రమం చూసిన వారి సంఖ్య 12 శాతం పెరిగింది.మరోవైపు దాదాపు 1.05 మిలియన్ల మంది ఎన్టీఆర్ సోషల్ మీడియా ఖాతా @tarak9999 ని మెన్షన్ చేశారు.ఇలా ఈ విషయంలోనూ తారక్ టాప్ లో నిలవడం విశేషమనే చెప్పాలి.ఇలా జూనియర్ ఎన్టీఆర్ ఒకదాని తర్వాత ఒకటి వరుసగా రికార్డుల మీద రికార్డులను సాధిస్తూ దూసుకుపోతున్నాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube