టాలీవుడ్ ప్రముఖ కమెడియన్లలో ఎమ్మెస్ నారాయణ ఒకరు అనే సంగతి తెలిసిందే.తాగుబోతు క్యారెక్టర్లు చేయడం ద్వారా ఎమ్మెస్ నారాయణ పాపులర్ అయ్యారు.
ఎం.ఎస్.నారాయణ అసలు పేరు మైలవరపు సూర్యనారాయణ కాగా కెరీర్ తొలినాళ్లలో రవిరాజా పినిశెట్టి దగ్గర పని చేసిన ఎమ్మెస్ నారాయణకు మా నాన్నకు పెళ్లి సినిమాతో గుర్తింపు వచ్చింది.మద్యం తాగకుండానే తాగినట్టు నటించే అద్భుతమైన టాలెంట్ ఎమ్మెస్ నారాయణ సొంతమని చెప్పవచ్చు.
అయితే నిజ జీవితంలో ఎమ్మెస్ నారాయణకు మద్యం అలవాటు ఉండేది.గతంలో ఒక ఇంటర్వ్యూలో రుక్మిణి ( Rukmini ) అనే సినిమాలో నేను తాగుబోతు పాత్రలో నటించానని నాగబాబు( Naga Babu ) కాంబినేషన్ లో నేను ఉంటానని ఆ పాత్ర అద్భుతంగా పేలిందని ఎమ్మెస్ నారాయణ అన్నారు.
ఆ సినిమా తర్వాత నా డిక్షన్ మారిపోయిందని ఆయన కామెంట్లు చేశారు.

నేను వందల సినిమాల్లో నటించినా తాగుబోతు పాత్రలకు సంబంధించి మొనాటనీ రాలేదని ఎమ్మెస్ నారాయణ పేర్కొన్నారు.కెరీర్ తొలినాళ్లలో ఒక డైరెక్టర్ నా కథ తీసుకుని ఎవరి పేరో వేసేశాడని ఆ డైరెక్టర్ పేరు నాగేశ్వరరావు( Nageswara Rao ) అని ఆయన చెప్పుకొచ్చారు.ఆ కథకు క్రెడిట్స్ కోసం పోరాటం చేశానని ఎమ్మెస్ నారాయణ అన్నారు.
ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీని అద్భుతమైన కమెడియన్ల కొరత వేధిస్తోంది.కొత్త కమెడియన్లు ఎంట్రీ ఇస్తున్నా ఆశించిన స్థాయిలో సక్సెస్ సాధించడం లేదు.

తెలుగు సినిమాలలో కామెడీకి సైతం ప్రాధాన్యత తగ్గుతోంది.టాలీవుడ్( Tollywood ) ఇండస్ట్రీకి మంచి రోజులు రావాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.కొంతమంది కమెడియన్లు భౌతికంగా దూరమైనా తమ సినిమాల ద్వారా ప్రేక్షకులకు మాత్రం దగ్గరగానే ఉన్నారని కామెంట్లు వినిపిస్తున్నాయి.కామెడీ సినిమాలను తెరకెక్కించే దర్శకుల సంఖ్య కూడా అంతకంతకూ తగ్గుతోందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.
అనిల్ రావిపూడి మినహా మిగతా డైరెక్టర్లు కామెడీకి ప్రాధాన్యత ఇవ్వడం లేదు.







