ఎన్టీఆర్ పోలికలు ఉండటం కైకాలకు కలిసొచ్చిందా.. అలా సక్సెస్ అయ్యారా?

కైకాల సత్యనారాయణ ఈరోజు ఉదయం 4 గంటల సమయంలో తన నివాసంలో తుదిశ్వాస విడిచారు.విలనిజంతో ప్రేక్షకులను భయపెట్టినా యముడి పాత్రలో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించినా ఆ ప్రతిభ కైకాలకు మాత్రమే సొంతమని చెప్పవచ్చు.

ఇంటర్ చదివే సమయంలో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి నటుడిగా సక్సెస్ కావాలని కైకాల సత్యనారాయణ అనుకున్నారు.777 సినిమాలలో నటించి కైకాల అరుదైన రికార్డ్ ను తన ఖాతాలో వేసుకున్నారు.సీనియర్ ఎన్టీఆర్ కు దగ్గరి పోలికలు ఉండటం ఆయనకు ఎంతగానో కలిసొచ్చింది.

సీనియర్ ఎన్టీఆర్ కు అప్పటికే స్టార్ హీరోగా గుర్తింపు ఉండటంతో ఎన్టీఆర్ కు డూప్ అవసరమైతే ఆ సన్నివేశాలలో సత్యనారాయణ నటించి మెప్పించేవారు.ఇండస్ట్రీ పెద్దలు సత్యనారాయణను ఎన్టీఆర్ కు నకలు అని భావించేవారు.

పౌరాణికాలలో ఘటోత్కచుడు, యముడు, దుర్యోధనుడు, రావణుని పాత్రల్లో నటించి కైకాల మెప్పించారు.టీడీపీ తరపున మచిలీపట్నం లోక్ సభకు సత్యనారాయణ ఎన్నికయ్యారు.సీనియర్ ఎన్టీఆర్ తో యాక్షన్ సన్నివేశాలలో పోటాపోటీగా నటించడం సత్యనారాయణ కెరీర్ కు ప్లస్ అయింది.50 సంవత్సరాల పాటు నటుడిగా విజయవంతంగా కైకాల సత్యనారాయణ కెరీర్ ను కొనసాగించడం గమనార్హం.కైకాల గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధ పడుతున్నారని సమాచారం.

వయస్సు సంబంధిత సమస్యల వల్లే ఆయన మృతి చెందారని తెలుస్తోంది.కైకాల భార్య పేరు నాగేశ్వరమ్మ కాగా ఈ దంపతులకు ఇద్దరు కొడుకులు, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు.ఎంతోమంది నటులకు కైకాల సత్యనారాయణ తన వంతు సహాయం చేశారు.

Advertisement

తన సినీ కెరీర్ లో వివాదాలకు దూరంగా ఉన్న అతికొద్ది మంది నటులలో కైకాల సత్యనారాయణ ఉన్నారు.ప్రముఖ నటుడు కైకాల సత్యనారాయణ ఎక్కువ మొత్తం డిమాండ్ చేసే అవకాశం ఉన్నా పరిమితంగా రెమ్యునరేషన్ తీసుకునేవారని సమాచారం అందుతోంది.

శ్రీవారి భక్తులకు క్షమాపణలు చెప్పిన బిగ్ బాస్ బ్యూటీ ప్రియాంక జైన్!
Advertisement
" autoplay>

తాజా వార్తలు