యంగ్ టైగర్ ఎన్టీఆర్ ( NTR ) హీరోగా టాలెంటెడ్ డైరెక్టర్ కొరటాల శివ ( Koratala Shiva ) దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ పాన్ ఇండియన్ మూవీ దేవర( Devara ).
తారక్ ఆర్ఆర్ఆర్ వంటి సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకుని ఆ తర్వాత కొరటాల శివ సినిమా చేస్తున్నాడు.
ఎన్టీఆర్ కెరీర్ లో 30వ సినిమాగా తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ ప్రజెంట్ శరవేగంగా జరుగుతుంది.జనవరి నాటికీ ఈ సినిమా షూట్ మొత్తం పూర్తి చేయాలని టార్గెట్ పెట్టుకున్నట్టు తెలుస్తుంది.
అందుకే గ్యాప్ లేకుండా షూటింగ్ ముగించేస్తున్నారు.ఇదిలా ఉండగా తాజాగా ఈ సినిమా షూట్ గురించి ఇంట్రెస్టింగ్ అప్డేట్ తెలుస్తుంది.
ఈ సినిమాలో ఒక ఫ్లాష్ బ్యాక్( Flash Back ) ఉందట.సముద్రం మధ్యలో ఉండే ఒక దీవి నేపథ్యంలో ఈ ఫ్లాష్ బ్యాక్ భారీ యాక్షన్ తో సాగుతుందని ఈ దీవి నేపథ్యంలోనే పార్ట్ 2 ఉంటుందని తెలుస్తుంది.ఇక ఈ ఫ్లాష్ బ్యాక్ లో ఎన్టీఆర్ రఫ్ అండ్ రగ్గడ్ లుక్ లో కనిపిస్తారని టాక్.
మొత్తం మీద స్టోరీ వినే కొద్దీ మరింత ఇంట్రెస్టింగ్ గా మారుతుంది.
కాగా ఈ సినిమాలో సైఫ్ అలీ ఖాన్ ( Saif Ali Khan ) విలన్ రోల్ లో నటిస్తుండగా హీరోయిన్ గా జాన్వీ కపూర్ ( Janhvi Kapoor ) నటిస్తుంది.యువసుధ ఆర్ట్స్ అండ్ ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ లపై 300 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ సినిమాకు అనిరుద్ రవిచంద్రన్ సంగీతం అందిస్తున్నాడు.ఇక 2024 ఏప్రిల్ 5న ఈ సినిమా గ్రాండ్ గా రిలీజ్ అవ్వబోతుంది.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy